ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 198
కృతి కర్బంద పోల్ డ్యాన్స్

13B హార్రర్ సీక్వెల్ లో చైతు..?
'జగదేకవీరుడు అతిలోక సుందరి' టైమ్ లెస్ క్లాసిక్

'భారతీయుడు 2' ఆగిపోలేదు.. అవన్నీ రూమర్స్ మాత్రమే..!

" గుడ్ ఓల్డ్ డేస్" - పాయల్ రాజ్ పుత్
మరో ప్రేమ కథా చిత్రం లో శర్వానంద్ ?
కియారా అద్వానీ లాక్ డౌన్ టైమ్ పాస్

'సల్మాన్ ఖాన్' వార్తలపై చిరు క్లారిటీ..!

ప్రయోగాత్మక చిత్రంగా 'ఐకాన్'..!
లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ సెలబ్రిటీస్
సమంత ఆన్ లైన్ యాక్టింగ్ క్లాసెస్
నితిన్ సినిమాలో మరో యంగ్ హీరో..!

విజయ్ దేవరకొండకు కు 'మా' మద్దతు..!
సీనియర్ డైరెక్టర్ వంశీ కూడా వెబ్ సిరీస్ వైపు..!
ఒకప్పుడు సినిమా చూడాలంటే చాలాకష్టమయ్యేది. కానీ రాను రాను టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అన్నీ ఈజీ అయిపోయాయి. ఇక ఇప్పుడు థియేటర్ కి వెళ్లి సినిమా చూసే పని కూడా లేకుండా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వల్ల ఇంట్లోనే కూర్చొని చూసే అవకాశం దక్కింది. ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ హవా నడుస్తోందని చెప్పవచ్చు. అందుకే సెలెబ్రిటీస్ సైతం డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు. వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ హీరోలు హీరోయిన్లను సైతం ను వెబ్ సిరీస్ లలో నటింపచేసి వాటికి మరింత క్రేజ్ తేవాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ప్రయత్నిస్తున్నాయి.
కృతి కర్బంద పోల్ డ్యాన్స్
"బోణి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి కర్బంద "తీన్ మార్ ", "ఒంగోలు గిత్త ", "బ్రూస్ లీ " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు తోపాటు కృతి కన్నడ, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కృతి కర్బంద నటించిన బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్ 4"ఘనవిజయం సాధించింది. కృతి ప్రస్తుతం పులకిత్ సామ్రాట్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ "తైష్ "లో నటిస్తున్నారు.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా... ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా వున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈవిషయాన్ని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. స్క్రిప్ట్ వర్క్ తో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుందంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ రోజుకో వార్త మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటీకే ఎన్నో వార్తలు రాగా ఇప్పుడు తాజాగా మరో…
సరోజిని నాయుడు బయో పిక్ ఫస్ట్ లుక్
భారత చలన చిత్ర పరిశ్రమ లో పలు బయోపిక్ మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. బయోపిక్ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు రాజకీయ కార్యకర్త, కవయిత్రి సరోజిని నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా "సరోజిని" హిందీ మూవీ రూపొందనుంది. ప్లేగు వ్యాధి టైమ్ లో సరోజిని నాయుడు అందించిన సేవలకు బ్రిటీష్ ప్రభుత్వం "కైసర్ -ఐ -హింద్" మెడల్ బహుకరించింది. ఆమె తన కవిత్వానికి "నైటింగేల్ ఆఫ్ ఇండియా" టైటిల్ అందుకున్నారు.

13B హార్రర్ సీక్వెల్ లో చైతు..?
మాధవన్, నీతూ చంద్ర ప్రధాన పాత్రల్లో...విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 13B ఎంత మంచి విజయం దక్కించుకుందో తెలుసు. 2009లో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఆ సినిమా, తెలుగులోను విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు ఉత్కంఠపరిచే థ్రిల్లింగ్ మూమెంట్స్ తో.. ట్విస్ట్ లతో మంచి సస్పెన్స్ ను క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా గురించిన ఉపోద్ఘాతం ఎందుకంటారా..? అసలు సంగతేంటంటే ఈ హార్రర్ థ్రిల్లర్ కు సీక్వెల్ రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఈ సీక్వెల్ లో నాగ చైతన్య హీరో గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
'జగదేకవీరుడు అతిలోక సుందరి' టైమ్ లెస్ క్లాసిక్
'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ సినిమా గురించిన విశేషాలు ఇప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే నానితో ఆ సినిమా ఎలా మొదలైందో.. ఎలా పూర్తయింది.. ఆ సినిమా విశేషాలు ఏంటి.. తెర వెనుక.. తెర ముందు మనకు తెలియని ఎన్నో విషయాలను వాయిస్ ఓవర్ తో ఓ వీడియో తో చెపుతున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా నటించిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా గురించి.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తను కూడా ఒక వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సందీప్ కిషన్ కొత్త సినిమా..!
సినిమా విజయాపజయాలతో పని లేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

'భారతీయుడు 2' ఆగిపోలేదు.. అవన్నీ రూమర్స్ మాత్రమే..!
'భారతీయుడు 2' ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ మొదటి నుండీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అసలు ఈ సినిమా మొదలవ్వడమే లేట్ అయింది... ఆ తర్వాత కమల్ కు ఏదో మేకప్ వల్ల స్కిన్ అలర్జి వచ్చిందని అప్పుడు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ షూట్ మొదలుపెట్టి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్నారు కదా అనుకునే మళ్ళీ క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన కాస్త సీరియస్సే అయింది. ఇక దీనితో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన లైకా ప్రొడక్షన్స్ యాజమాన్యం.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవి కేవలం రూమర్స్ మాత్రమే.. ఇప్పటికే 60 శాతం వరకూ షూటింగ్ పూర్తయింది.. ఇప్పుడు…

" గుడ్ ఓల్డ్ డేస్" - పాయల్ రాజ్ పుత్
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం, అభినయం తో యూత్ ను హుషారెక్కించారు. యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న పాయల్ "వెంకీ మామ ", "డిస్కో రాజా "మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం జయంత్ పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న "నరేంద్ర" మూవీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటిస్తున్నారు. "ఏంజెల్ " మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ కానున్నారు.
మరో ప్రేమ కథా చిత్రం లో శర్వానంద్ ?
యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న "శ్రీకారం "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "RX 100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ "మహా సముద్రం" మూవీ కి శర్వానంద్ ఓకే చెప్పారు. శర్వానంద్ ఇప్పుడు మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
కియారా అద్వానీ లాక్ డౌన్ టైమ్ పాస్
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన రెండవ తెలుగు మూవీ "వినయ విధేయ రామ " పరాజయం పాలయ్యింది. ఆ మూవీ తరువాత సూపర్ హిట్ మూవీ"అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్ "కబీర్ సింగ్" మూవీ లో కియారా నటించారు. "కబీర్ సింగ్" మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించడంతో హిందీ మూవీస్ లో కియారా అద్వానీ బిజీ హీరోయిన్ గా మారారు.

'సల్మాన్ ఖాన్' వార్తలపై చిరు క్లారిటీ..!
చిరు లూసిఫర్ సినిమా ఇంకా ప్రారంభం కాకముందే అప్పుడే ఈ సినిమాలో కాస్టింగ్ పై పలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముందు అల్లు అర్జున్ నటిస్తున్నాడని.. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం కూడా లేదని అన్నారు. ఇప్పుడు తాజాగా ఈ వార్తలపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. లూసిఫర్ రీమేక్ కు సంబంధించి కథలో మార్పులు జరుగుతున్నాయని.. బాలీవుడ్ హీరో సల్మాన్ నటిస్తున్నాడని వస్తున్న వార్తలు రూమర్స్ అని కొట్టి పడేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులుపూర్తయిన తరువాతే నటీనటులు ఎంపిక జరుగుతుందని చెప్పారు. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందో లేదో చూద్దాం..

ప్రయోగాత్మక చిత్రంగా 'ఐకాన్'..!
శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సుకుమార్ సినిమా కంటే ముందే మొదలవ్వాలి కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అయింది. ఇక ప్రస్తుతం శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో బిజీ గా వున్నాడు. మరోవైపు బన్నీ సుకుమార్ సినిమాతో బిజీగా వున్నాడు. వారి సినిమాలు పూర్తయిన తర్వాత వీరిద్దరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ సెలబ్రిటీస్
ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయం లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఇంటి పనులు, పాత సినిమాలు, కుకింగ్, వర్క్ అవుట్స్, బుక్ రీడింగ్, ఆన్ లైన్ క్లాసెస్, ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేయడం వంటి వాటితో సెలబ్రిటీస్ లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి కరోనా వ్యాధి పై ప్రజలలో అవగాహన కల్పించడానికి ట్వీట్స్ చేస్తూ, కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సినీ కార్మికుల సంక్షేమానికై పాటు పడుతూ, ఇల్లు క్లీనింగ్, గార్డెనింగ్ పనులతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
విశాఖపట్నం దుర్ఘటనపై టాలీవుడ్ నటుల ప్రగాఢ సానుభూతి..!
వైజాగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీకవడంతో అక్కడ వున్న ప్రజలు అస్వస్థతకు గురవ్వగా... ఈ సంఘటనలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా దీనిపై స్పందించి... ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.
సమంత ఆన్ లైన్ యాక్టింగ్ క్లాసెస్
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సమంత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు, అత్తారింటికి దారేది, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోలీవుడ్ లో నాన్ ఈ, నీ దానే ఎన్ పొన్ వసంతం, కత్తి, తెరి , 24, మెర్సల్, ఇరుంబు తిరై, యు టర్న్, సూపర్ డీలక్స్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను సమంత అలరించారు.
నితిన్ సినిమాలో మరో యంగ్ హీరో..!
భీష్మ సూపర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.వెంకీ తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని రొమేంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నాడు.
'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ చేసే రిటైర్ అవుతా..!
'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. చిరు-శ్రీదేవి హీరో హీరోయిన్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో.. అశ్విని దత్ నిర్మాణంలో 1990 మే 9న వచ్చిన సినిమా సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక క్లాసిక్ గానే ఉంటుంది. ఇక ఈ సినిమా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ప్రారంభమైంది... ఈ సినిమాకు సంబందించిన పలు విశేషాలను సినీ ప్రేక్షకులంతో పంచుకుంటున్నారు. నాని వాయిస్ ఓవర్ తో ఈ సినిమా వీడియోస్ తీసి రిలీజ్ చేస్తున్నారు.
సందీప్ కిషన్ 'డీకే బోస్' కి టైమొచ్చింది -స్నీక్ పీక్ వీడియో రిలీజ్..!
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో కెరియర్ లో మొదటి సారి సూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ కు ఆ తర్వాత ఆశించినంత విజయాలు దక్కలేదు అని చెప్పొచ్చు. ఇటీవలే నిను వీడని నీడను నేనే అంటూ సక్సెస్ కొట్టాడు. ఆ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించి పర్వాలేదనిపించుకున్నాడు.

విజయ్ దేవరకొండకు కు 'మా' మద్దతు..!
మొత్తానికి విజయ్ ఏం చేసినా సెన్సేషనే అని మరోసారి నిరూపించాడు. సెలబ్రిటీస్ మీద తప్పుడు వార్తలు రావడం కామన్ థింగ్. ఇక వాటిని ముందు సీరియస్ తీసుకున్నా ఇప్పుడు పట్టించుకోవట్లేదు సెలబ్రిటీస్. అయితే విజయ్ మీద కూడా గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. విజయ్ కూడా వాటిని పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం తన సాయం చేసే విషయంలో.. ఛారిటీ విషయంలో తప్పుడు కథనాలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసాడు. అంతే కాదు ఒక స్పెషల్ వీడియో కూడా తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. టాలీవుడ్ మొత్తం విజయ్ కు సపోర్ట్ గా వచ్చింది. మెగా స్టార్ నుండి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.