
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు థమన్. ఈ మధ్య వచ్చిన ‘అల వైకుంఠపురములో ‘ సినిమా ఆడియోకు మంచిపేరు రావడంతో థమన్ కు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్” సోలో బతుకే సో బెటర్”, రవితేజ మూవీ “క్రాక్”, కీర్తి సురేష్ “మిస్ ఇండియా” , నాని “టక్ జగదీష్”, వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. వాటితో పాటు వి సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇంకా సెట్స్ పైకి రాని సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB 27, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కూడా థమన్ ను అనుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తమిళ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది. మురగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన తుపాకి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. 2012 లో వచ్చిన ఆ సినిమా విజయ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మురుగదాస్ ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్, హరీష్ జైరాజ్, అనిరుద్ లాంటి సంగీత దర్శకులతో పనిచేశారు. అయితే థమన్ ఫామ్ లో ఉండటంతో ఈ సినిమాకు థమన్ ను తీసుకోవాలనుకుంటున్నాడట. అన్ని కుదిరితే మురుగదాస్, విజయ్ క్రేజీ కాంబోలో తమన్ అవకాశం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: