‘బుట్ట బొమ్మ’ పాట ‘అల వైకుంఠపురములో’ అనుకోలేదు ముందు..!

Butta Bomma Song Was Initially Not A Part Of Alavaikunthapurramuloo Album Says Music Director Thaman
Butta Bomma Song Was Initially Not A Part Of Alavaikunthapurramuloo Album Says Music Director Thaman

‘అలవైకుంఠపురములో’ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. థమన్ సూపర్ హిట్ ఆడియోను అందించాడు. ‘సామాజ వరగమనా’ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటినుండి మొదలైన రికార్డుల మోత ఇప్పటికీ కొనసాగుతుంది. ‘బుట్ట బొమ్మ’, రాములో రాములా’ పాటలు కొత్త కొత్త రికార్డులు  క్రియేట్ చేస్తున్నాయి. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆయన సతీమణితో కలిసి రీసెంట్ గా బుట్టబొమ్మ సాంగ్ స్టెప్ ను వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక తాజాగా ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్ వ్యూస్ ను సాధించి మరో రికార్డు ను తన ఖాతాలో వేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ పాట గురించి థమన్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. అదేంటంటే ఈ పాటను మొదట ఈ సినిమాలో అనుకోలేదట థమన్. ముందు వేరే పాటను అనుకున్నాడట.. అయితే ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు బన్నీ కి చెప్పాను… ఈ పాట కాకుండా వేరే బావుంటుందని.. అప్పుడు బుట్ట బొమ్మ సాంగ్ చేసాను.. మూడు రోజుల్లో ఈ పాట చేయాల్సి వచ్చింది. అలా బుట్ట బొమ్మ పాట ‘అల వైకుంఠపురములో’ కి వచ్చింది అని తెలిపాడు. మరి బుట్టబొమ్మ పాట కనుక లేకపోయివుంటే ఈ రికార్డ్ వచ్చి ఉండేది కాదేమో.

కాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దిగి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇక వరుస హిట్స్ తో థమన్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు పలు సినిమాలకు పని చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB 27, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ, సాయి ధరమ్ తేజ్” సోలో బతుకే సో బెటర్”, రవితేజ మూవీ “క్రాక్”, కీర్తి సురేష్ “మిస్ ఇండియా” , నాని “టక్ జగదీష్”, వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =