నాగార్జున ‘వారసుడు’కి 27 ఏళ్ళు

Akkineni Nagarjuna Musical Blockbuster Varasudu Completes 27 Years

‘కింగ్’ నాగార్జున, దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘వారసుడు’. హిందీ సినిమా ‘ఫూల్ ఔర్ కాంటే’కి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీలో నాగ్ సరసన నగ్మా నాయికగా నటించింది. నాగ్‌కి తండ్రిగా సూపర్ స్టార్ కృష్ణ కీలక పాత్రలో దర్శనమివ్వగా.. శ్రీకాంత్, బ్రహ్మానందం, బాబుమోహన్, దేవరాజ్, గుమ్మడి, తనికెళ్ళ భరణి, శరత్ సక్సేనా, బాల‌య్య‌, గీత, తిరుపతి ప్రకాష్, రవితేజ ముఖ్య భూమికలు పోషించారు. మురళీమోహన్ సమర్పణలో శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి బాణీలు అందించగా.. వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర, వెన్నెలకంటి సాహిత్యం సమకూర్చారు. “పాప హలో హలో”, “ధిన్ తనక ధిన్”, “డేంజర్ యమ డేంజర్”, “సిలకలాగ”, “ఛమ్ ఛమ్ ఛమ్ ప్రియా”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. 1993 మే 6న విడుదలై ఘనవిజయం సాధించిన ‘వారసుడు’.. నేటితో 27 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + three =