త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈసినిమాలో పాటలు ఎంత రికార్డ్స్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ పాటలు వ్యూయర్‌షిప్ పరంగా పలు రికార్డులు నమోదు చేశాయి. ఇక బుట్ట బొమ్మ మరో రికార్డ్ క్రియేట్ చేసింది.గత నెలలో 100 మిలియన్ల మార్కు దాటిన ఈ బుట్టబొమ్మ వీడియో సాంగ్ తాజాగా 150 మిలియన్ల మార్కు చేరుకోవడం విశేషం. 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో బుట్టబొమ్మ సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటోంది. థమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను సింగర్ అర్మన్ మాలిక్ ఆలపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ నేపథ్యంలో ఈ పాటకు వస్తున్న వ్యూస్ పై అర్మన్ మాలిక్ స్పందించారు. ఈ పాట అన్ని చోట్ల ట్రెండింగ్ అయిందని.. ఇంత ప్రేమ చూపించినందుకు చాలా థ్యాంక్స్ అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. మరి ముందు ముందు ఈ పాట ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























