తారక్, చరణ్ మధ్య నిలబడగలిగే నటి కావాలి.. అందుకే అలియా..!

Director SS Rajamouli Reveals The Reason Behind Casting Alia Bhatt In RRR
Director SS Rajamouli Reveals The Reason Behind Casting Alia Bhatt In RRR

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అంతేకాదు ఈ లాక్‌డౌన్ సమయంలో RRR మూవీ గురించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తామని చెప్పారు. దీనిలో భగంగానే ఇటీవలే చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ వీడియో కోసం చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఆలియా భట్ గురించి రాజమౌళి చెప్పిన మాటలను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు అందించింది. అసలు సీత పాత్రకు ఆలియా భట్‌ను ఎందుకు ఎంపిక తీసుకున్నారో రాజమౌళి చెప్పారు. ‘‘సీత పాత్ర కోసం తారక్, చరణ్ మధ్య నిలబడగలిగే నటి నాకు కావాలి. ఎందుకంటే వాళ్లిద్దరూ చాలా టాలెంటెడ్ నటులు. అలా అని ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాదు. సీత అమాయకంగా ఉండాలి. అలాగే దాడి చేసే విధంగా ఉండాలి. చాలా హుషారుగా ఉండాలి. అందుకనే ఈ పాత్ర కోసం ఆలియా భట్‌ను ఎంపిక చేసుకున్నాను’’ అని రాజమౌళి వెల్లడించారు. మరి ఈ అప్డేట్ తో అటు ఈ విషయం చెబుతూనే మరోపక్క అలియా ఈ సినిమా నుండి తప్పుకోలేదు అన్న వార్తలకు క్లారిటీ ఇచ్చేసారు.

ఇక ఈ సినిమా షూటింగ్ లో అలియా మే నుండి పాల్గొననున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో జూన్ నుండి ఆమె షూటింగ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. జూన్ నుండి సినిమా షూటింగ్ లకు కూడా అనుమతులు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − six =