ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెండి తెరపై ఒక ఊపు ఊపిన హీరోలు ఇప్పుడు రీ ఎంట్రీ లో విలన్ పాత్రల్లో తమ సత్తా చూపిస్తున్నారు. జగపతి బాబు, మాధవన్, వివేక్ ఒబెరాయ్ ఇంకా ఈ లిస్ట్ లో అరవింద్ స్వామి కూడా వున్నారు. 90వ దశకంలో రోజా, బొంబాయి లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ స్వామి క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తున్నాడు. ఇక ధృవ సినిమాతో మంచి స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామి కి ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలనుకుంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచన ఉండటంతో, బాలీవుడ్ హీరోయిన్స్ ను ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామిని తీసుకోవాలనుకుంటున్నారట. ఈ సినిమా కోసం ఫోన్ లోనే అరవింద్ స్వామిని సంప్రదించినట్టు తెలుస్తోంది. మరి అరవింద్ స్వామి కూడా ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: