చిరు గారు అండగా ఉంటే సరిపోదు.. యాక్షన్ ప్లాన్ కావాలి..!

Akkineni Nagarjuna Appeals Mega Star Chiranjeevi To Come Up With A Stringent Action Plan Against Fake News
Akkineni Nagarjuna Appeals Mega Star Chiranjeevi To Come Up With A Stringent Action Plan Against Fake News

కిల్ ఫేక్ న్యూస్ అంటూ విజయ్ దేవరకొండ స్టార్ట్ చేసిన వీడియోకు మంచి స్పందనే వచ్చింది. మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి ‘మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో సహాయక కార్యక్రమాలు చేప‌ట్టగా దానిపైనా పలు వార్తలు వచ్చాయి. తనపై వచ్చిన వార్తలను ఖండిస్తూ విజయ్.. ఫేక్ న్యూస్ రాసిన వారిపై మండిపడ్డాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో విజయ్ కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. నీకు అండగా ఉన్నామంటూ ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, నాగబాబు, కొరటాల శివ తదితరులు స్పందించగా ఇప్పుడు నాగార్జున కూడా స్పందించారు. చిరంజీవి ట్వీట్ పై ఆయన స్పందిస్తూ… సినీ పరిశ్రమలోని సహచరుడికి అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. మహేశ్, రవితేజ, రానా, కొరటాల శివ, క్రిష్, వంశీ పైడిపల్లి అందరూ నీకు అండగా ఉన్నారని విజయ్ దేవరకొండకు భరోసా కల్పించారు. అయితే, కేవలం అండగా ఉంటే సరిపోదని… ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు మనకు ఒక యాక్షన్ ప్లాన్ కావాలని నాగార్జున ట్వీట్ చేశారు.

కాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 17 =