హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి వుంది. కానీ కొన్ని పరిస్థుతుల వల్ల కాలేదు. అయితే లాక్ డౌన్ తర్వాత ఉన్న రిలీజ్ లు కూడా ఆగిపోయాయి. దీనితో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ వార్తలు మాత్రం ఆగలేదు. ప్రతిరోజూ ఈ సినిమాపై వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్ ఈ చిత్ర విడుదలపై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. ‘‘మా చిత్రం ‘నిశ్శబ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము..’’ అని కోన వెంకట్ తన ట్వీట్‌లో తెలిపారు.
Lot of speculations r being made on the release of our film NISHABDHAM in the media.We would like to clarify that “Theatrical release is our top PRIORITY.If the situation isn’t favourable for a long time then our alternate would be to release on OTT platform”. Hope for the best👍
— kona venkat (@konavenkat99) May 22, 2020
ఇంకా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: