రెబల్ స్టార్ కృష్ణంరాజు సెన్సేషనల్ మూవీ ‘బొబ్బిలి బ్రహ్మన్న’కు 36 ఏళ్ళు

36 Years for Krishnam Raju Bobbili Brahmanna

రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేష‌న్‌లో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఒకటి. కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శారద, జయసుధ నాయికలుగా నటించారు. కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్‌ప్రసాద్, రాజేష్, ముచ్చర్ల అరుణ, అన్నపూర్ణ, కృష్ణవేణి ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. “చలిగాలి వీచింది”, “తద్దినక తద్దినక మల్లెలు తెచ్చా”, “అబ్బా నాతో పెట్టుకోమాక”, “ఓ రాతి మనిషి”, “బొబ్బిలి బ్రహ్మన్న – బుర్రకథ”.. ఇలా ఇందులోని ప్రతీ పాట అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ పతాకంపై యు.వి.సూర్యనారాయణరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. `ఉత్త‌మ నటుడు’(కృష్ణంరాజు), ‘ఉత్తమ సహాయనటి’(శారద), ‘ఉత్తమ దర్శకుడు’(కె.రాఘవేంద్రరావు) విభాగాల్లో ‘నంది’ పురస్కారాలను కైవ‌సం చేసుకుందీ సినిమా. అంతేకాదు.. ఈ చిత్రంతో `ఉత్త‌మ నటుడు’గా ‘ఫిల్మ్ ఫేర్’ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు కృష్ణంరాజు. హిందీలో ‘ధ‌రమ్ అధికారి’ పేరుతోనూ, క‌న్న‌డ‌లో ‘ధ‌ర్మ‌పీఠ’ పేరుతోనూ ఈ సినిమాని రీమేక్ చేశారు. 1984 మే 25న విడుదలై ఘ‌న‌విజ‌యం సాధించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’.. నేటితో 36 వసంతాలు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + six =