‘వీర'(2011) తరువాత మాస్ మహరాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్గా నటించనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా.. మరొకటి కిల్లర్ తరహా పాత్ర అని టాక్. ఈ రెండు పాత్రల మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని వినికిడి.
మరి.. ఇందులో నిజానిజాలు ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
కాగా, రవితేజ తాజా చిత్రం ‘క్రాక్’ చిత్రీకరణ తుది దశలో ఉంది. గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న ఈ కాప్ డ్రామాలో శ్రుతిహాసన్ నాయికగా నటిస్తోంది. యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: