శ్రీకాంత్ కెరీర్‌ను మేలిమలుపు తిప్పిన చిత్రం ‘తాజ్‌మహల్’కు 25 ఏళ్ళు

25 Years For Srikanth’s Taj Mahal Movie

నిన్నటితరం కథానాయకుడు శ్రీకాంత్ కెరీర్‌లో పలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. వాటిలో శ్రీకాంత్ కెరీర్‌ను మేలిమలుపు తిప్పిన ‘తాజ్‌మహల్’ ఒక‌టి. శ్రీకాంత్‌కి సోలో హీరోగా తొలి విజ‌యాన్ని అందించిన సినిమా ఇదే కావడం విశేషం. మోనికా బేడి, సంఘవి నాయికలుగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాసరావు, నూతన్‌ప్రసాద్, బ్రహ్మానందం, బాబుమోహన్, సుధాకర్, మల్లికార్జునరావు, అచ్యుత్, సుధ ముఖ్య భూమికలు పోషించారు. ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డా.సి.నారాయణరెడ్డి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్(తొలి చిత్రం) సాహిత్యం సమకూర్చిన ఈ సినిమాకి యం.యం.శ్రీలేఖ బాణీలు అందించారు. “మంచుకొండల్లోని చంద్రమా”, “ఓ కల కన్నది”, “పెళ్లి పెళ్ళంటూ”, “సాగిపోయే నీలి మేఘం”, “ఝుం ఝుం అంటూ”, “చిక్ లిక్ చిక్ లిక్”.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘల్ డి.రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1995 మే 25న విడుదలైన ‘తాజ్‌మహల్’.. నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + eleven =