మా మధ్య ఎలాంటి సంబంధం లేదు..!

I Am Not In Relationship With Kamal Haasan Says Actress Pooja Kumar

విలక్షణ నటుడు.. నటనను నేర్చుకోవాలని వచ్చే హీరోలకు ఆయన సినిమాలు ఒక లైబ్రరీ లాంటివి. ఇక కమల్ సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన పర్సనల్ లైఫ్ కు వస్తే మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. మొదట సారికను వివాహమాడిన కమల్ ఆ తర్వాత ఆమెతో విడిపోయారు. ఆ తర్వాత గౌతమితో కూడా చాలా కాలం పాటు కలిసే ఉన్నాడు కమల్. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. హీరోయిన్ గౌతమితో విడిపోయాక ఆయన మరో నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అంతేకాకుండా పూజా కుమార్ తరచుగా కమల్ హాసన్ ఫ్యామిలీ ఫంక్షన్‌లకు హాజరవుతుండటం, వారి కుటుంబ సభ్యురాలిగా మెలుగుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వార్తలపై కమల్ తో తనకు ఉన్న అనుబంధంపై పూజా కుమార్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమెను ఈ విషయంపై అడుగగా.. దానిపై ఆమె మాట్లాడుతూ… గత ఐదారేళ్లుగా కమల్ సార్‌తో కలిసి పని చేస్తున్నా కాబట్టి తనకు కమల్‌తో పాటు వారి ఫ్యామిలీతో కూడా బాగా పరిచయమని చెప్పింది. అందుకే వారి కుటుంబ వేడుకలకు హాజరవుతున్నా తప్పితే అంతకుమించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని పూజా కుమార్ పేర్కొంది. కాగా విశ్వరూపం, ఉత్తమ విలన్, విశ్వరూపం 2 చిత్రాల్లో కమల్‌తో కలిసి పూజా కుమార్ నటించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 16 =