‘నో పెళ్లి’ అంటున్న సాయి తేజ్.. నేనూ చూస్తా అంటున్న నితిన్..!

Funny Conversation Between Sai Dharam Tej and Nithiin
Funny Conversation Between Sai Dharam Tej and Nithiin

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉండగా లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. లేకపోతే అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కారణం తెలిసిందే కదా..

ఇక ఇన్ని రోజుల్లో ఎలాంటి అప్ డేట్ ఇవ్వడానికి కుదరలేదు. అయితే తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫస్ట్ ప్రమోషనల్ సాంగ్ ‘నో పెళ్లి’ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రమోషనల్ సాంగ్ లా స్పెషల్ గా షూట్ చేసిన ఈ పాటను నితిన్ రిలీజ్ చెసాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేస్తూ ఓ కామెంట్ చేశారు. ఈ సినిమా నుంచి సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉదంటూనే.. పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటావో నేనూ చూస్తానని సాయి ధరమ్ తేజ్‌ని ఉద్ధేశించి సరదా వ్యాఖ్యలు చేశాడు నితిన్. ”కొన్ని సార్లు చేసుకోవడంలో టైమ్‌ గ్యాప్‌ ఉంటుందేమోగానీ చేసుకోవడం మాత్రం పక్కా” అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు.


నితిన్ ట్వీట్ పై తేజ్ స్పందించి.. ”నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను బ్రదర్‌, ట్రెండ్‌ సెట్‌ చేస్తా” అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ సాంగ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రానా దగ్గుబాటిలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోల పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ మధ్యే నిఖిల్ పెళ్లి చేసుకోగా.. నితిన్ పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లాక్‌డౌన్ పూర్తి కాగానే షాలినితో నితిన్ మ్యారేజ్ జరగనుంది. ఇక రానా అయితే ఒకరకంగా అందరికీ షాకిచ్చాడని చెప్పొచు. తన ప్రేమను బయటికి చెప్పడం.. ఎంగేజ్ మెంట్ ఇలా అన్నీ చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు.. వరుణ్ తేజ్ పెళ్లిపై స్పందిస్తూ త్వరలోనే వరుణ్ మ్యారేజ్ చేస్తామని అన్నారు. ఈ టైములో సాయి తేజ్ పాట రావడంతో సోషల్ మీడియాలో ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here