పుష్ప సినిమాలో ‘స్టార్ యాంకర్’.. అన్నీ రూమర్సే..!

Anchor Suma Is Not A Part Of Pushpa Says Movie Team
Anchor Suma Is Not A Part Of Pushpa Says Movie Team

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. లాక్ డౌన్ అయిపోగానే షూటింగ్ ను ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమాను మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్నారు. విదేశాల్లో షూటింగ్ లు లేవు.. అక్కడి టెక్నేషియన్స్ ఇక్కడికి రావడానికి ఛాన్స్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే సగానికి పైగా పాటలను పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాలో స్టార్ యాంకర్ సుమ ఒక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇందులో నిజం లేదని తెలుస్తుంది. ఇక ఈ వార్తల్లో నిజం లేదని.. సుమ ఎలాంటి పాత్రలో నటించడం లేదని సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం. అసలు ఈ రూమర్స్ ఎలా వచ్చాయో కూడా అర్థంకావట్లేదని అంటున్నారు. నిజానికి ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ను సుకుమార్ ఎప్పుడో ఎంపిక చేసుకున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్‌ గా నివేత పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =