మళ్ళీ ‘చందమామే’ అంటున్న తేజ..!

Director Teja To Team Up Again With Kajal Aggarwal After Seetha
Director Teja To Team Up Again With Kajal Aggarwal After Seetha

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఆ తర్వాత సీత సినిమాను తీసినా అది పెద్దగా విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఎప్పుడో ఈ రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో
‘రాక్షసరాజు రావణాసురుడు’రానా నటిస్తుండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ‘అలివేలుమంగ వెంకటరమణ’ లో మళ్ళీ కాజల్ నే తీసుకోవాలని చూస్తున్నాడట తేజ. ‘అలివేలుమంగ వెంకటరమణ’ సినిమాలో హీరోయిన్ గా మొదట కీర్తి సురేష్ ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కాజల్ పేరు వినిపిస్తుంది. గోపీచంద్-కాజల్ కాంబినేషన్ లో ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. దీనితో కాజల్ అయితే ఈ సినిమాలో బావుంటదని.. తేజ భావించి మళ్ళీ తననే తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే తనను కలవటం కూడా కూడా జరిగిందట. మరి చూద్దాం ఏమవుతుందో.

కాగా ఇప్పటికే తేజ-కాజల్ కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. అసలు కాజల్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది తేజనే. లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ ను పరిచయం చేసాడు. ఆ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’, ఆ వెంటనే సీత సినిమా తీశాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 4 =