ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 175
నిత్య మీనన్ న్యూ ట్యాలెంట్

నితిన్ కు జోడీగా నభా నటేష్ ?

100 రోజుల తరువాత తిరిగి ఇంటికి మంచు వారి కోడలు
సాహో డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్ మెంట్
లాక్ డౌన్ టైమ్ లో అనన్య పాండే
'పెంగ్విన్' ట్రైలర్ రిలీజ్
పవన్ కళ్యాణ్ పై శృతి హాసన్ ప్రశంసలు
మలయాళ రీమేక్ లో రాజశేఖర్ ?
పవర్ ఫుల్ కాంబినేషన్ - తెరపైకి రోజుకో టైటిల్..!
చిరు మనవరాలి క్యూట్ క్లీనింగ్ వీడియో..

రానా పెళ్లి మాత్రం జరిగే తీరుతుంది..!
నీహారిక తమిళ మూవీ ప్రారంభం

మరో కోణం లో పాయల్ రాజ్ పుత్
"అలివేలు మంగ వెంకటరమణ " ఆన్ లైన్ ఆడిషన్స్

స్టైలిష్ ఎన్నారై పాత్రలో ఎన్టీఆర్ ?

ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు మీరు
వర్మ స్పీడ్ మాములుగా లేదుగా..!
మళ్లీ సెట్స్ పైకి ధనుష్ - నాగార్జున సినిమా..!
విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "పెళ్ళిచూపులు " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన విజయ్ పై ప్రేక్షక , అభిమానులలో క్రేజ్ పెరిగింది. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో విజయ్ స్టార్ హీరోగా మారారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే కథానాయిక .
నిత్య మీనన్ న్యూ ట్యాలెంట్
బ్లాక్ బస్టర్ "అలా మొదలైంది " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిత్య మీనన్ ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. నిత్య మీనన్ నటించిన "ఇష్క్ ", జబర్దస్త్ ", "గుండె జారి గల్లంతయ్యిందే ", "మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు "," S/O సత్యమూర్తి ", జనతా గ్యారేజ్" మూవీస్ ఘనవిజయం సాధించాయి. "గుండె జారి గల్లంతయ్యిందే ", "మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు " మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ నిత్య అందుకున్నారు.

నితిన్ కు జోడీగా నభా నటేష్ ?
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ "భీష్మ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్ ప్రస్తుతం "రంగ్ దే ", చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందే "పవర్ పేట " మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

100 రోజుల తరువాత తిరిగి ఇంటికి మంచు వారి కోడలు
ఈ లాక్ డౌన్ వల్ల కొంతమందికి తమ కుటుంబాలతో గడిపే సమయం దొరికితే.. కొంతమంది మాత్రం అదే కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్క పక్క రాష్ట్రాల వారే అటు ఇటు వెళ్ళడానికి లేకుండా పోయింది. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎంతోమంది మధ్యలో ఇరుక్కుపోయారు. ఇక్కడికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆగిపోయారు. మంచు విష్ణు భార్య విరనికా కూడా దాదాపు 3 నెలల నుండి సింగపూర్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉండగా.. `వందేభారత్ మిషన్`లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు వంద…
సాహో డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్ మెంట్
మొత్తానికి టాలీవుడ్ లో ఈ ఏడాది పెళ్లిళ్ల సందడి ఎక్కువైంది. అదేం విచిత్రమో కానీ ఇన్నేళ్లు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ఒక పక్క కరోనా ఉన్నా కూడా లెక్కచేయకుండా పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ పెళ్లి జరిగిపోయింది. రానా పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడు. నితిన్ కూడా లైన్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు అలా పెళ్లి వార్తలు వచ్చాయో లేదో ఇలా నిశ్చితార్థం చేసేసుకున్నాడు సాహో డైరెక్టర్ సుజీత్. ప్రవల్లిక అనే డెంటిస్ట్‌తో సుజీత్ గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్‌లో సుజీత్-ప్రవళికల నిశ్చితార్థం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఎంగేజ్ మెంట్ చాలా…
లాక్ డౌన్ టైమ్ లో అనన్య పాండే
సూపర్ హిట్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 "మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అనన్య పాండే నటించిన "పతి పత్ని ఔర్ వో " మూవీ ఘనవిజయం సాధించింది. అనన్య ప్రస్తుతం "ఖాలీ పీలీ " మూవీ లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ తో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనన్య టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.
'పెంగ్విన్' ట్రైలర్ రిలీజ్
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'పెంగ్విన్'. ఇక ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ ట్రైలర్ ను తెలుగులో నాని రిలీజ్ చేయగా.. తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్‌లాల్ రిలీజ్ చేశారు. సైకో కిల్లర్ ని ఒంటరిగా ఎదిరించే మహిళగా కీర్తి పాత్ర కనిపిస్తుంది. ఇక సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రలో కీర్తి నటన సూపర్.
పవన్ కళ్యాణ్ పై శృతి హాసన్ ప్రశంసలు
లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం రవి తేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
మలయాళ రీమేక్ లో రాజశేఖర్ ?
సక్సెస్ ఫుల్ "ప్రతిఘటన "(1985) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజశేఖర్ నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. "తలంబ్రాలు " మూవీ కి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ , "మగాడు ", "అన్న " మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా రాజశేఖర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. రాజశేఖర్ నటించిన "PSV గరుడ వేగ " మూవీ ఘనవిజయం సాధించగా "కల్కి " మూవీ నిరాశ పరచింది. రాజ శేఖర్ ఇప్పుడు ఒక మలయాళ రీమేక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
పవర్ ఫుల్ కాంబినేషన్ - తెరపైకి రోజుకో టైటిల్..!
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా.. అసలు ఇంకా సినిమా ఉంటుందో?లేదో? అధికారికంగా ప్రకటించలేదు.. ఒకవేళ ఉన్న ఇప్పట్లో ఉంటుందో లేదో కూడా తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ పై రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తూనే ఉంటుంది. నిజానికి అధికారికంగా ప్రకటించకపోయినా సినిమా అయితే ఉందన్నది ఇప్పటికే పలు హింట్స్ ద్వారా అర్థమైపోయింది. మరి ఒకసారి కన్ఫామ్ అయితే వార్తలు ఆపడం కష్టమే కదా. అలా సినిమాపై కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న వార్త ఏంటంటే. టైటిల్ విషయంలో.
చిరు మనవరాలి క్యూట్ క్లీనింగ్ వీడియో..
కరోనా వల్ల నిత్యం సినిమాలతో బిజిబిజీగా గడిపే నటీనటులు ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నారు. కొందరు పిల్లలతో, మరికొందరు మనవడు, మనవరాళ్లతో ముచ్చట్లు చెబుతూ లాక్‌డౌన్‌ను టైమ్ పాస్ చేస్తున్నారు. ఇక చిరు కూడా ఇంట్లో సరదాగా టైమ్ పాస్ చేస్తున్నారు. అంతేకాదు తన మనవరాలు అల్లరికి సంబంధించిన క్యూట్ వీడియోస్ కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో నీవిష్క చిన్న చీపురు పట్టుకొని ఊడుస్తుంది. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేసిన చిరు..కరోనా నేపథ్యంలో క్లీనింగ్ చేస్తుంది అంటూ చిన్న కాప్షన్ ఇచ్చారు.
'అసురన్' చైనీస్ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన 'అసురన్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం కామనే కాబట్టి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నారప్పగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా…

రానా పెళ్లి మాత్రం జరిగే తీరుతుంది..!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన రానా దగ్గుబాటి కొద్ది రోజుల క్రితం తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా ప్రకటించిన వెంటనే ఇలా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొని షాకిచ్చాడు. అయితే లాక్ డౌన్ అయిపోయిన తరువాతఈ ఏడాది చివరిలో పెళ్లి జరపాలనుకున్నారు కానీ ఆగస్ట్ 8న పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే గత రెండు రోజుల నుండి వివాహం వాయిదా పడ్డట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసే అవకాశాలున్నాయంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి.
నీహారిక తమిళ మూవీ ప్రారంభం
"ఒక మనసు "మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన మెగా డాటర్ నీహారిక హ్యాపీ వెడ్డింగ్ ", " సూర్యకాంతం " మూవీస్ లో నటించారు. పలు వెబ్ సిరీస్ లో నటించిన నీహారిక , విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన "ఓరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ " తమిళ మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. నీహారిక ఇప్పుడు మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరో కోణం లో పాయల్ రాజ్ పుత్
సూపర్ హిట్ "RX 100" మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం ఫైటర్ పైలెట్ గా "నరేంద్ర "తెలుగు మూవీ లో నటిస్తున్నారు. తమిళమూవీ "ఏంజెల్ "తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో పాయల్ ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే.
"అలివేలు మంగ వెంకటరమణ " ఆన్ లైన్ ఆడిషన్స్
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తేజ దర్శకత్వంలో యాక్షన్ స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా "అలివేలు మంగ వెంకటరమణ " మూవీ రూపొందనుంది. "లక్ష్మీ కళ్యాణం "మూవీ తో కాజల్ అగర్వాల్ , "జయం "మూవీ తో నితిన్ , "చిత్రం "మూవీ తో ఉదయ్ కిరణ్, "జై " మూవీ తో నవదీప్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన తేజ ఇప్పుడు "అలివేలు మంగ వెంకటరమణ" మూవీ కి హీరో హీరోయిన్స్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ కు కొత్తవారిని పరిచయం చేయాలని నిర్ణయించారు.

స్టైలిష్ ఎన్నారై పాత్రలో ఎన్టీఆర్ ?
వరుస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీ కై భారీ అంచనాలతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న "#NTR30 " మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు మీరు
నందమూరి బాలకృష్ణ ఈ రోజు 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్, వెంకీ ఇలా పలువురు ఇప్పటికే తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా బాలకృష్ణకు తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు, నేను ఎప్పుడూ అభిమానించే హీరో బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తమ ట్వీట్ లో పేర్కొన్నారు.
వర్మ స్పీడ్ మాములుగా లేదుగా..!
ప్రభుత్వాలు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా.. ఎప్పుడు షూటింగ్ లు మొదలు పెడదామా అని ఇన్ని రోజులు ఎదురు చూసారు.. మొత్తానికి సినీ పెద్దలందరూ కలిసి ఇరు ప్రభుత్వాలతో మాట్లాడి అనుమతులు తెచ్చుకున్నారు. మరికొద్దిరోజుల్లో అందరూ షూటింగ్‌లు మొదలుపెట్టుకోనున్నారు. అయితే ఈ అనుమతులు.. లాక్ డౌన్ మాత్రం వర్మకు కాదనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ పరిస్థితుల్లో షూటింగ్‌లు ఎలా చేయాలబ్బా అని తలలు పట్టుకుంటుంటే వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సడన్ గా సినిమా పోస్టరో.. టీజరో రిలీజ్ చేసి అందరికీ షాకిస్తాడు. ఇప్పటికే మియా…
మళ్లీ సెట్స్ పైకి ధనుష్ - నాగార్జున సినిమా..!
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ఈ ఏడాది మొదట తూట అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ వెంటనే మరో సినిమాతో వచ్చాడు. ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో `పటాస్` పేరుతో ఓ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. ధనుష్ ద్విపాత్రాభినయంలో.. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ సూపర్ హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘కర్ణన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. దానితో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న ‘జగమే తంత్రం’. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది.