ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు మీరు

Mahesh Babu Wishes Natasimha Nandamuri Balakrishna on his birthday
Mahesh Babu Wishes Natasimha Nandamuri Balakrishna on his birthday

నందమూరి బాలకృష్ణ ఈ రోజు 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్, వెంకీ ఇలా పలువురు ఇప్పటికే తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా బాలకృష్ణకు తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు, నేను ఎప్పుడూ అభిమానించే హీరో బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తమ ట్వీట్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక వెంకీ కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. `ప్రియమైన బాలయ్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీ వ్యక్తిగత, వృత్తిగత జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. `బీబీ3`లో మీరు అద్భుతంగా ఉన్నారని వెంకీ ట్వీట్ చేశారు.

మంచు లక్ష్మి కూడా బాలయ్యకు విషెస్ తెలిపారు. `నేను అన్నయ్య పిలిచే వారిలో బాలయ్య ఒకరు. 16 ఏళ్ల వయసు వారు మాత్రమే మీ ఎనర్జీని మ్యాచ్ చేయగలరు. 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు` అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

కాగా ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసారు. అంతేకాదు నేడు ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించనున్నారు. వాళ్ళు అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + four =