వర్మ స్పీడ్ మాములుగా లేదుగా..!

RGV announces back to back films
RGV announces back to back films

ప్రభుత్వాలు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా.. ఎప్పుడు షూటింగ్ లు మొదలు పెడదామా అని ఇన్ని రోజులు ఎదురు చూసారు.. మొత్తానికి సినీ పెద్దలందరూ కలిసి ఇరు ప్రభుత్వాలతో మాట్లాడి అనుమతులు తెచ్చుకున్నారు. మరికొద్దిరోజుల్లో అందరూ షూటింగ్లు మొదలుపెట్టుకోనున్నారు. అయితే ఈ అనుమతులు.. లాక్ డౌన్ మాత్రం వర్మకు కాదనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ పరిస్థితుల్లో షూటింగ్లు ఎలా చేయాలబ్బా అని తలలు పట్టుకుంటుంటే వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సడన్ గా సినిమా పోస్టరో.. టీజరో రిలీజ్ చేసి అందరికీ షాకిస్తాడు. ఇప్పటికే మియా మాల్కోవాతో ”క్లైమాక్స్” రూపంలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేయడమే కాకుండా రిలీజ్ కూడా చేసేస్తున్నాడు. సొంత యాప్ ‘ఆర్జీవీ వరల్డ్ – శ్రేయాస్ ఈటీ’ క్రియేట్ చేసి దానిలో సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా మరో రెండు సినిమాలను లైన్ పెట్టాడు. వాటిలో ఒకటి ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ కాగా మరొకటి గాడ్సే నేపథ్యంలో రాబోతున్న ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’. తన ట్విట్టర్ వేదికగా ఈ ప్రాజెక్ట్స్ ను ప్రకటించాడు. ‘క్లైమాక్స్’ సినిమా తన సొంత ప్లాట్ ఫాంలో సూపర్ హిట్ కావటంతో ఇదే నా కెరీర్ కు బిగినింగ్ అని భావిస్తున్నాను.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలను తన ఆర్జీవీ వరల్డ్ థియటర్ లో రిలీజ్ చేస్తానంటూ ప్రకటించాడు. అంతేకాదు ”థియేటర్స్ గురించి మర్చిపోండి. సినిమా భవిష్యత్ ఓటీటీలో కాదు. కేవలం పర్సనల్ యాప్ లో మాత్రమే ఉంది” అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి వర్మ ఇలాంటి పరిస్థితుల్లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోవడం మాములు విషయం కాదు.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − two =