‘అసురన్’ చైనీస్ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

Asuran Producer Gives Clarity about Chinese Remake
Asuran Producer Gives Clarity about Chinese Remake

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం కామనే కాబట్టి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నారప్పగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ సినిమాను చైనీస్ లో కూడా రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై నిర్మాత స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఇంతవరకు అలాంటి చర్చలు ఏమి జరగలేదని.. చైనీస్ లో అసురన్ సరికొత్తగా రూపొందనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత కలైపులి ఎస్ థాను వివరణ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 4 =