కరోనా వల్ల నిత్యం సినిమాలతో బిజిబిజీగా గడిపే నటీనటులు ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నారు. కొందరు పిల్లలతో, మరికొందరు మనవడు, మనవరాళ్లతో ముచ్చట్లు చెబుతూ లాక్డౌన్ను టైమ్ పాస్ చేస్తున్నారు. ఇక చిరు కూడా ఇంట్లో సరదాగా టైమ్ పాస్ చేస్తున్నారు. అంతేకాదు తన మనవరాలు అల్లరికి సంబంధించిన క్యూట్ వీడియోస్ కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో నీవిష్క చిన్న చీపురు పట్టుకొని ఊడుస్తుంది. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేసిన చిరు..కరోనా నేపథ్యంలో క్లీనింగ్ చేస్తుంది అంటూ చిన్న కాప్షన్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























