ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘పెంగ్విన్’. ఇక ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ ట్రైలర్ ను తెలుగులో నాని రిలీజ్ చేయగా.. తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్‌లాల్ రిలీజ్ చేశారు. సైకో కిల్లర్ ని ఒంటరిగా ఎదిరించే మహిళగా కీర్తి పాత్ర కనిపిస్తుంది. ఇక సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రలో కీర్తి నటన సూపర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy to launch the trailer of #Penguin .This looks very promising, intriguing and scary👌🏼👍🏼
First day first show at home fix kitty @KeerthyOfficial 🤗https://t.co/LMhaIT0gB2 –
Telugu@EashvarKarthic @karthiksubbaraj @Music_Santhosh @KharthikD @PrimeVideoIN #PenguinTrailer— Nani (@NameisNani) June 11, 2020
కాగా ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకం పై సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.
ఇక డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవబోతున్నమొదటి పెద్ద సినిమా ఇదే కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఈ థ్రిల్లర్ ఎలా ఆకట్టుకుంటుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: