ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా.. అసలు ఇంకా సినిమా ఉంటుందో?లేదో? అధికారికంగా ప్రకటించలేదు.. ఒకవేళ ఉన్న ఇప్పట్లో ఉంటుందో లేదో కూడా తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ పై రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తూనే ఉంటుంది. నిజానికి అధికారికంగా ప్రకటించకపోయినా సినిమా అయితే ఉందన్నది ఇప్పటికే పలు హింట్స్ ద్వారా అర్థమైపోయింది. మరి ఒకసారి కన్ఫామ్ అయితే వార్తలు ఆపడం కష్టమే కదా. అలా సినిమాపై కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న వార్త ఏంటంటే. టైటిల్ విషయంలో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకు మొదట ‘రేడియేషన్’ అన్న టైటిల్ ను అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి కారణం ఎన్టీఆర్ బర్త్ డే కి ప్రశాంత్‌నీల్ చేసిన ట్వీట్ కూడా ఒక కారణం. ‘మీరు పక్కనుంటే న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర కూర్చున్న భావన కలుగుతుంది. త్వరలో రేడియేషన్ సూట్ ధరించి మీ వద్దకు రాబోతున్నా’ అని ప్రశాంత్‌నీల్ ట్వీట్ చేసాడు. దానితో ఇక ‘రేడియేషన్’ టైటిల్ అవ్వొచ్చు అని వార్తలు రాసేశారు. ఇక ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది. అది న్యూక్లియర్ అండ్ మిస్సైల్ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి సినిమా ప్రారంభం అయ్యేలోపు ఇంకెన్ని టైటిల్స్ తెరపైకి వస్తాయో.. అసలు ప్రశాంత్ నీల్ టైటిల్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.



ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. పరిస్థితులు బాగున్నట్టయితే ఈ ఏడాది చిత్రం విడుదల అయ్యేది. కానీ కరోనా వల్ల కాలేదు. ఇప్పటికే దాదాపు 70 శాతం చిత్ర షూటింగ్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్.. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి మరి కొద్ది రోజులలో ఈ చిత్రానికి ప్యాకప్ చెప్పనున్నట్టు తెలుస్తుంది. మరో పక్క ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో బిజీ. ఈ సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా. మరి ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం ఒక ఏడాది టైం అయినా పట్టొచ్చేమో.. లేకపోతే రెండు సినిమాలు ఒకేసారి చేస్తాడేమో చూద్దాం ఏం జరుగుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























