రానా పెళ్లి మాత్రం జ‌రిగే తీరుతుంది..!

No Changes In Rana Daggubati & Miheeka Bajaj Marriage Date
No Changes In Rana Daggubati & Miheeka Bajaj Marriage Date

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌లలో ఒకరైన రానా దగ్గుబాటి కొద్ది రోజుల క్రితం తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా ప్రకటించిన వెంటనే ఇలా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొని షాకిచ్చాడు. అయితే లాక్ డౌన్ అయిపోయిన తరువాతఈ ఏడాది చివరిలో పెళ్లి జరపాలనుకున్నారు కానీ ఆగస్ట్‌ 8న పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే గత రెండు రోజుల నుండి వివాహం వాయిదా పడ్డట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసే అవ‌కాశాలున్నాయంటూ కొన్ని వార్త‌లు వెలువ‌డ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు ఈ వార్తలపై స్పందించిన ఇరు కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. పెళ్లి వాయిదా పడిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు. ముందు చెప్పినట్టే ఆగష్ట్8 నే పెళ్లి జరిగి తీరుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా లాక్‌డౌన్ మ‌రోసారి పొడిగించినా రానా పెళ్లి మాత్రం జ‌రిగే తీరుతుందంటున్నారు. మరి ఇప్పటికే ఈ వార్తలను ఆపుతారేమో చూద్దాం.

ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + six =