‘బాహుబలి’ కంటే ‘ఆర్ఆర్ఆర్’ పది రేట్లు గూజ్ బంప్స్..!

RRR Movie Going To Have More Goosebumps Movements Than Bahubali Says Lyricist Madhan Karky

ఆర్ఆర్ఆర్ ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులే కాదు దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఇక ఒక్కోసారి మనం ఎంత ఎదురు చూస్తామో అంత లేట్ అవుతుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా పేరు వింటూనే వున్నాం. రాజమౌళి సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది. టైం కాస్త ఎక్కువ తీసుకున్నా పర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇస్తాడు. అందుకే కాస్త లేట్ అయినా కూడా అభిమానులు ఎదురుచూస్తుంటారు. ముందు ఈఏడాది జులై 30 న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కుదరకపోవడంతో 2021 జనవరి లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక ఇప్పుడు కూడా రిలీజ్ డేట్ కష్టమే. కరోనా వల్ల పరిస్థితులు మొత్తం తారుమారైపోయ్యాయి. గత నాలుగు నెలల నుండి షూటింగ్స్ లేవు.. థియేటర్స్ లేవు. అనుమతులు దొరికినా షూటింగ్స్ చేయలేని పరిస్థితి. దీనితో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఫ్యాన్స్ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు.

ఇక ఇదిలా ఉండగా బాహుబలి కంటే ఆర్ఆర్ఆర్ లో అంతకుమించి సన్నివేశాలు వుంటాయని అంటున్నారు రచయిత మాధన్ కార్కే. బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ యొక్క తమిళ వెర్షన్ డైలాగ్ ల రచయిత మాధన్ కార్కే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన ఆయన బాహుబలి కంటే పది రేట్లు గూజ్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉంటాయని.. ఆర్ఆర్ఆర్ ప్రారంభం నుండే అలాంటి సన్నివేశాలు ఉంటాయని మాధన్ చెప్పారు’. దీనితో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here