ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 161
ఎన్టీఆర్ Vs మనోజ్ - అంతా తూచ్..!
పవన్ సినిమా తర్వాత 'ఐకాన్' సినిమానే..!

Vi ఆనంద్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ మూవీ ?
కియారా అద్వానీ స్టన్నింగ్ లుక్
వెబ్ సిరీస్ లో స్టార్ హీరోయిన్ ?
మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న "నిన్నుకోరి "
పెళ్లి చేసుకోమని దుల్కర్ మోటివేట్ చేసేవాడు..!
పెట్ డాగ్ ను పరిచయం చేసిన విజయ్..!
శర్వానంద్ కు జోడీ గా రాశీఖన్నా ?
మేఘా ఆకాష్ కు బాలీవుడ్ ఆఫర్
రజినీ - కమల్ సినిమా ఆగేది లేదు..!
తెలుగు రీమేక్ కు మలయాళం హిట్ సినిమా 'కప్పేల'..!
తెలుగు సంచలనానికి 7ఏళ్లు..!
ఫైనల్లీ.. బ్యాక్ టు వర్క్
కరోనా దెబ్బకి షూటింగ్ లు లేక సెలబ్రిటీస్ అందరు దాదాపు మూడు నాలుగు నెలల నుండి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలు పెడుతుండటతో ఒక్కొక్కరూ షూటింగ్ లలో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాప్సి కూడా షూట్ కి రెడీ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసింది. షూటింగ్ లొకేషన్ లో తన మేకప్ రూమ్ లో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ బ్యాక్ టు వర్క్ అనే క్యాప్షన్ ను జోడించింది. బాలీవుడ్ లో షూటింగ్ మొదలుపెట్టిన మొదటి వ్యక్తి తాప్సి కావడం విశేషం. అందరూ షూటింగ్ లు మొదలు పెట్టడానికి భయపడుతున్న వేళ తాప్సి ధైర్యంగా షూట్ లో పాల్గొనడానికి సిద్దమయిందంటే మెచ్చుకోతగ్గ విషయమే.

OTT లో రిలీజ్ అయిన మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ?
"పెంగ్విన్ ", "కృష్ణ అండ్ హిజ్ లీల", "భానుమతి రామకృష్ణ " మూవీస్ OTT లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీస్ గురించి తెలుసుకుందాం.
రూమర్స్ ను కొట్టిపడేసిన బోయపాటి..!
మరోసారి బాలయ్య - బోయపాటి సినిమా హీరోయిన్ వార్త తెరపైకి వచ్చింది. గతంలోనే బోయపాటి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త హీరోయిన్ ను ఈ సినిమాలో పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇక కొద్దిరోజులు ఈ రూమర్లకు బ్రేక్ పడినా మళ్ళీ రెండు రోజులుగా ఒక హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అమలా పాల్. బాలకృష్ణ సరసన అమలా పాల్ నటించనున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి.
ఎన్టీఆర్ Vs మనోజ్ - అంతా తూచ్..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో `అయిననూ పోయి రావలే హస్తినకు` అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు త్రివిక్రమ్. అయితే ఈ సినిమాపై ఏదో ఒక వార్త బయటకి వస్తూనే వుంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. దానిపై ఇంకా క్లారిటీ రాకముందే రెండు రోజులుగా మరో రూమర్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో నటించే విలన్ పాత్రపై. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అసలు ఎవరూ ఊహించని పేరు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తాడని వార్తలొచ్చాయి.
పవన్ సినిమా తర్వాత 'ఐకాన్' సినిమానే..!
శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దీనితో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేంలేదంటూ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు.

Vi ఆనంద్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ మూవీ ?
ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన Vi ఆనంద్ "హృదయం ఎక్కడున్నది " మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సైన్స్ ఫిక్షన్ "అప్పుచి గ్రామం " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. రొమాంటిక్ థ్రిల్లర్ "ఎక్కడికి పోతావు చిన్నవాడా " మూవీ తో సక్సెస్ సాధించారు. "ఒక్క క్షణం ", "డిస్కో రాజా " వంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.
కియారా అద్వానీ స్టన్నింగ్ లుక్
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన "వినయ విధేయ రామ " మూవీ ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ మూవీ తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కియారా నటించిన "కబీర్ సింగ్ "హిందీ మూవీ ఘనవిజయం సాధించింది. తెలుగు సూపర్ హిట్ " అర్జున్ రెడ్డి " హిందీ రీమేక్ గా రూపొందిన "కబీర్ సింగ్ " మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.
వెబ్ సిరీస్ లో స్టార్ హీరోయిన్ ?
2 దశాబ్దాలుగా తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ , ప్రేక్షకులను అలరిస్తున్న త్రిష స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "వర్షం ", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే "(తెలుగు ) "కొడి ", "96 "(తమిళ ) మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. లాక్ డౌన్ సమయం లో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన త్రిష ప్రస్తుతం 6 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. త్రిష ఇప్పుడు ఒక తమిళ వెబ్ సిరీస్ లో నటించనున్నారని సమాచారం.
మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న "నిన్నుకోరి "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , నివేత థామస్ , ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "నిన్నుకోరి" మూవీ 2017 సంవత్సరం జులై 7 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో శివ నిర్వాణ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. గోపిసుందర్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి. ఈ రోజు తో "నిన్నుకోరి" మూవీ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.
పెళ్లి చేసుకోమని దుల్కర్ మోటివేట్ చేసేవాడు..!
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ కలిసి ‘బెంగళూర్ డేస్’, ‘ఓకే కన్మని’, ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉందన్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా దుల్కర్ గురించి మాట్లాడుతూ... `దుల్కర్ పూర్తిగా ఫ్యామిలీ పర్సన్. పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేవాడు. పెళ్లి చేసుకోమని నన్ను మోటివేట్ చేసేవాడు. `ఓకే బంగారం` సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. వెండితెర మీద మమ్మల్ని చూసుకుని మేమే ఆశ్చర్యపోయాం` అని నిత్య తెలిపింది.
పెట్ డాగ్ ను పరిచయం చేసిన విజయ్..!
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమతమైన విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ లేవు చాలా ఖాళీగా ఉండటంతో ఈ ఈ టైంను బాగా ఉపయాగించుకుంటున్నాడు. విజయ్ ఇటీవలే ఫిల్మ్ నగర్ లో ఒక ఇంటిని కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ చేసే పనిలో బిజీగా వున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా సినిమాతో పాటు పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో పోస్ట్ చేసి తన ఫ్యామిలీలోకి మరొక మెంబర్ వచ్చారంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్ డాగ్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. ఇందులోని ఓ…
సక్సెస్ ను తలకు ఎక్కించుకోవద్దని చిరంజీవి చెప్పారు..!
షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయి టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన తెలుగమ్మాయి ప్రియాంకా జువాల్కర్. మొదటి సినిమాతోనే నటిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు.. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో ఆ సినిమా తర్వాత అవకాశాలు పెరిగిపోతాయని అందరూ భావించారు. కానీ ఈ భామకు అలాంటి అవకాశాలు పెద్దగా వచ్చింది లేదు. అయితే ‘టాక్సీవాలా’ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన ప్రియాంకకు ఎట్టకేలకు మరో ఆఫర్ వచ్చింది.
శర్వానంద్ కు జోడీ గా రాశీఖన్నా ?
సూపర్ హిట్ "RX 100 " మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "మహాసముద్రం " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ హీరోగా శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరోయిన్ గా సాయి పల్లవి ని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇప్పుడు రాశీఖన్నా ను సంప్రదించినట్టు , ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మేఘా ఆకాష్ కు బాలీవుడ్ ఆఫర్
యాక్షన్ థ్రిల్లర్ "లై " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ "ఛల్ మోహన్ రంగ" మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ "పేట " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. మేఘా ఆకాష్ ప్రస్తుతం "మనుచరిత్ర "(తెలుగు ), ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ బిగ్ మూవీ లో మేఘా ఆకాష్ కు ఆఫర్ వచ్చింది.
తన బయోపిక్ తీసే ప్లాన్ లో వెటరన్ హీరో కార్తీక్..!
తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇప్పుడు మరో హీరో కూడా తన బయోపిక్ తానే తీసుకునే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు వెటరన్ హీరో కార్తీక్.
రజినీ - కమల్ సినిమా ఆగేది లేదు..!
కరోనా వల్ల షూటింగ్ లు లేక ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడి ఉన్నాయి. అసలు షూటింగ్ లు అయిన సినిమాలకే రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకా షూటింగ్ అవ్వని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇంకా సెట్స్ పైకి వెళ్లని సినిమాల సంగతి గురించి చెప్పేదేముందని. కొన్ని సినిమాలు అయితే ఆగిపోయాయంటు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రజినీ-కమల్ సినిమా కూడా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు.
మీకు తెలుసా.. ఆస్కార్ అవార్డ్స్ కు ఇన్విటేషన్ అందుకున్న తొలి సౌత్ హీరో చిరు..!
ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగ.. డైలాగ్ చెప్పినా.. డ్యాన్స్ చేసినా ఫ్యాన్స్ కు పూనకాలే. ఇలా ఒక్కటేంటి.. అతడేం చేసినా అభిమానులకు అదో పండగే. ఆ హీరో ఎవరో ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకెవరు భారతీయ సినీ పరిశ్రమ గర్వించతగ్గ హీరో చిరంజీవి.
తెలుగు రీమేక్ కు మలయాళం హిట్ సినిమా 'కప్పేల'..!
ఒక భాషలో సినిమాలు మరో భాషలో రీమేక్ అవ్వడం ఇప్పుడు పరిపాటి అయిపోయింది. ఇటీవల మన తెలుగు సినిమాలు ఎన్నో బాలీవుడ్ లో రీమేక్ అవ్వడం చూసాం. అంతేకాదు ఆ సినిమాలు అక్కడ కూడా మన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా మన తెలుగు వాళ్లకు మలయాళ సినిమాలపై కన్ను పడింది. అక్కడ హిట్ అయిన వెంటనే తెలుగు హక్కులను కొనేస్తున్నారు. ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ రానా, రవితేజలతో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు సంచలనానికి 7ఏళ్లు..!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా రేంజ్ ను భారీ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడమే కాకుండా.. ఇండియన్ హిస్టరీలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. తెలుగు సినీ చరిత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొదటి సినిమా. అంతేకాదు ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని…
అల్లు అర్జున్ , ఎన్టీఆర్ డ్యాన్స్ లు ఇష్టం - ప్రణీత సుభాష్
తెలుగు , తమిళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్ ప్రస్తుతం "రామన అవతార "కన్నడ మూవీ లో నటిస్తున్నారు. "భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా " మూవీ తో ప్రణీత బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. మరో హిందీ మూవీ "హంగామా 2" లో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో బాధితులకు తనవంతు సాయం అందజేశారు. ఆదివారం (5వ తేదీ ) ప్రణీత ట్విట్టర్ లో తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.