‘నారప్ప’ నుండి వెంకీ పెద్ద కొడుకు లుక్ రిలీజ్..!

Narappa Movie Team Releases Karthik Rathnam First Look From The Movie On The Occasion Of His Birthday

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా… తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్‌ను సురేశ్ ప్రొడక్షన్స్ తమ ట్విట్టర్‌ ఖాతాలో విడుద‌ల చేసింది. ఈ సినిమాలో ఈ పాత్ర‌లో కార్తీక్ ర‌త్నం న‌టిస్తున్నాడు.ఈ రోజు కార్తీక్ రత్నం పుట్టినరోజు కావడంతో ఈ సంద‌ర్భంగా ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తున్నట్లు సురేశ్ ప్రొడక్షన్స్‌ తెలిపింది. సైకిల్‌పై కార్తీక్‌ రత్నం వెళ్తున్నట్లు ఉన్న ఈ పోస్ట‌ర్ అభిమానులను ఆకర్షిస్తోంది.


కాగా ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =