కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 151

సినిమా వార్తలు

మిహికాను పెళ్లిచేసుకోవడం నా లైఫ్ లోనే బెస్ట్ టైమ్..!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే ట్యాగ్ నుండి ఇప్పటికే నితిన్ బయటపడిపోయాడు. ఇక ఈ లిస్ట్ లో నుండి రానా కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చేయనున్నాడు. ఇప్పటికే రానా - మిహికాతో ఎంగేజ్ మెంట్ కూడా అయిపోగా ఆగష్ట్ లో మిహికా మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడు. ఇక ఈ సందర్భంగా తన పెళ్లి గురించి, మిహికా గురించి మాట్లాడుతూ రానా పలు ఆసక్తికర విషయాలు తెలియచేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ కొత్త సినిమా..!

కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు 'గరుడ వేగ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తుది శ్వాస విడిచిన వెటరన్ యాక్టర్,రచయిత 'రావి కొండలరావు'

ఈ ఏడాది కరోనా వచ్చి ఒక పక్క సినీ పరిశ్రమకు అసలే తీవ్ర నష్టంలో ఉంటే.. మరోపక్క పలు సినిమా పరిశ్రమలకు చెందిన లెజెండ్రీ నటులతో పాటు కొంతమంది యువ నటీనటులు కూడా మృతి చెందారు. ఇప్పుడు తాజాగా మరో వెటరన్ నటుడు రావి కొండలరావు తుది శ్వాస విడిచారు. గుండెపోటు కు గురైన రావి కొండలరావు హైదరాబాద్‌లోని వివేకానంద ఆసుపత్రిలో చేరిపించగా.. అక్కడ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

TFN Adminవాట్సాప్
One Needs To Rely Only On Their Talent To Survive In The Film Industry Says Actress Shruti Haasan
సినిమా వార్తలు

ఇంటిపేరు కాదు టాలెంట్ ఉంటేనే సక్సెస్..!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజం పై పెద్ద ఎత్తునే చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు నెపోటిజంను మొదటి నుండి వ్యతిరేకించే బాలీవుడ్ క్వీన్ కంగనా పలువురిపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో నేషనల్ వైడ్ గా ఈ టాపిక్ మరింత వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే ఈ అంశంపై మాట్లాడగా ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్.

TFN Adminవాట్సాప్
Tollywood Actress Sneha To Play A Key Role In NBK 106
సినిమా వార్తలు

#NBK 106 మూవీ లో కీలక పాత్ర లో స్నేహ

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన స్నేహ వివాహానంతరం సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు , తమిళ మూవీస్ లో స్నేహ నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన "వినయ విధేయ రామ " మూవీ లో నటించిన స్నేహ తిరిగి బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దుల్కర్ - హను రాఘవపూడి మూవీ అనౌన్స్ మెంట్.. 'లెఫ్టినెంట్ రామ్' ప్రేమక‌థ‌..

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్థింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక ఇటీవల కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ రోజు దుల్క‌ర్ స‌ల్మాన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో…

TFN Adminవాట్సాప్
Tollywood Actor Naga Shaurya Shares His Happiness As His First Look Poster Of His New Movie NS20 Gets Good Response From Audience.
ఫస్ట్ లుక్

ఆనందంలో నాగశౌర్య

యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్న ఈ మూవీ లో "రొమాంటిక్ " మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందుతున్న "NS20 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. అద్భుతంగా ఉన్న నాగశౌర్య లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja To Play The Role Of A Detective In His Upcoming Movie
సినిమా వార్తలు

డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?

"విక్రమార్కుడు ", పవర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో మాస్ మహారాజా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఎటువంటి క్యారెక్టర్ లో నైనా తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ లో నటించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రజలకు మహేష్ బాబు సందేశం

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి, ప్రతీ మంచి సందర్భానికి ట్వీట్స్ ద్వారా ప్రజలకు సందేశం ఇస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు ఇంటికి పరిమితం అయ్యి తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న "సర్కారు వారి పాట " మూవీ కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకున్నాక సెట్స్ పైకి వెళ్ళనుంది .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్రియేటివ్ డైరెక్టర్ కు హ్యాపీ బర్త్ డే.. కృష్ణవంశీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా?

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృషవంశీ అని టక్కున చెప్పేస్తాం. లవ్ ,క్రైమ్,ఫ్యాక్షన్, రివల్ల్యూషన్, ఫ్యామిలీ, ఫాంటసీ, పాట్రియటిక్ ,ఫీల్ గుడ్, మెసేజ్ ఓరియంటెడ్ ….ఇలా అన్ని రన్నింగ్ జోనర్స్ లో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ తీసిన అరుదైన ఘనత కృష్ణవంశీ కి దక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Fame Actress Rashmika Mandanna Says Yes To Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు రెడీ - రష్మిక

పలు సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు , కన్నడ ప్రేక్షకులను అలరిస్తూ కన్నడ బ్యూటీ రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో రష్మిక దూసుకుపోతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సాంగ్

ధ్రువ స‌ర్జా, ర‌ష్మికా 'పొగ‌రు' సినిమా నుండి రానున్న 'క‌రాబు' పాట

క‌న్న‌డ స్టార్ హీరో.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు ధ్రువ స‌ర్జా, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'పొగరు'. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'విక్ట‌రీ', 'అధ్య‌క్షా', 'ర‌న్న‌', 'ముకుంద మురారి' వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన నంద‌కిశోర్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి జంటగా నిఖిల్ , లావణ్య త్రిపాఠి ?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "కుమారి 21 F "ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా "18 పేజెస్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. "18 పేజెస్ " మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Tollywood Actress Kiara Advani To Play The Lead Role In Chandramukhi Movie Sequel
సినిమా వార్తలు

"చంద్రముఖి " మూవీ సీక్వెల్ హీరోయిన్ కియారా అద్వానీ ?

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభు , జ్యోతిక , నయనతార ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ హారర్ "చంద్రముఖి "తమిళ మూవీ 2005 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "చంద్రముఖి " మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించింది. హీరో రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. "చంద్రముఖి " మూవీ డబ్బింగ్ వెర్షన్స్ హిందీ , జర్మన్ , టర్కిష్ భాషలలో రిలీజ్ అయింది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

వర్మ 'మర్డర్' ట్రైలర్ రిలీజ్

సాహితి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ను తీస్తున్నట్టు ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటినుండి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆసక్తిని పెంచుతూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేసాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి ఈ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. తండ్రి త‌న కూతురిని గారాబంగా చూడడం, అమృత ప్రేమ‌లో ప‌డ‌డం, ప్ర‌ణ‌య్ హత్య ఇలా త‌దిత‌ర అంశాలు ట్రైల‌ర్‌లో చూపించారు. పిల్లలను ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలను కనగలం…

TFN Adminవాట్సాప్
Tuesday Trivia: Interesting Fact about Melody Brahma Mani Sharma
సినిమా వార్తలు

'మెలొడీ బ్రహ్మ' గురించి మీకు తెలుసా..?- 2 దశాబ్దాలు.. ఒక్క ఆడియో ఫంక్షన్ మాత్రమే..!

మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు మణిశర్మ అని. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు.. ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించాడు మణిశర్మ. ఇళయరాజా, ఎం.ఎం.కీరవాణి, రాజ్-కోటిల దగ్గర పనిచేసిన ఆయన "సూపర్ హీరోస్" చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 200 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. ఒక పదేళ్లు వెనక్కి వెళితే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గానే దాదాపు అన్ని సినిమాలూ ఉండేవి. కెరీర్ మొదట అగ్ర తారల సినిమాలకు మ్యూజిక్ అందించి.. అగ్రతారల మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఎన్నో మెలోడీ సాంగ్స్ అందించారు. ఇరవై రెండేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని విజయాల్ని సొంతం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియా లో మహేష్ బాబు సెన్సేషన్

"భరత్ అనే నేను ", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు " వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో వర్కౌట్స్ , తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
Naga Shaurya Latest Movie NS 20 First Look Is Out
ఫస్ట్ లుక్

#NS20 ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక. నాగశౌర్య ఈ మూవీ లో ప్రొఫెషనల్ ఆర్చర్ గా నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
స్పెషల్

సమంత ఇన్ స్టాగ్రామ్ లో 11 మిలియన్ ఫాలోవర్స్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత లాక్ డౌన్ సమయంలో రీల్ లైఫ్ విషయాలతో పాటు రియల్ లైఫ్ విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , పెట్ డాగ్ తో ఆడుకుంటూ , టెర్రస్ పై ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Akhil Akkineni Upcoming Movie Most Eligible Bachelor Quarantine Poster To Release On 29th July
ఫస్ట్ లుక్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' రానున్న క్వారెంటైన్ పోస్టర్..!

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి తెలిసిందే. కరోనా వల్ల సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దానితో సినిమా ప్రమోషన్స్ కూడా ఆపేసారు. అయితే అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వున్నారు. ఇక తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' నుండి క్వారెంటైన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్