ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 123
మెగా స్టార్ చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ ?
వెబ్ సిరీస్ లో సాయి పల్లవి
నాగశౌర్య - అనీష్ కృష్ణ సినిమా లాంచ్
రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ
మనసుకు నచ్చితే చాలు - అనుష్క
"పెళ్ళిసందD " మూవీలో మాళవిక నాయర్
షూటింగ్ కు రెడీ అవుతున్న 'వకీల్ సాబ్'
ఛార్మీ పేరెంట్స్ కు కరోనా పాజిటివ్
కామెడీ ఎంటర్ టైనర్ "F 2: ఫన్ &ఫ్రస్టేషన్"
మొదలైన శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్
రీతూ వర్మ ట్రెడిషినల్ లుక్
"పెళ్ళి సందD" మూవీ హీరో రోషన్
లాంఛనంగా ప్రారంభమైన ‘థ్యాంక్యూ’
ఆకట్టుకుంటున్న 'ఆకాశమే నీ హద్దురా' ట్రైలర్
మిస్ కాజల్ అగర్వాల్ గా ఇంకా రెండు రోజులే
మొత్తానికి ఇంకో రెండు రోజుల్లో మిస్ టాగ్ నుండి మిస్ట్రెస్ టాగ్ కు మారిపోనుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అభిమానులకు ఇది కొంచం బాధ కలిగించే విషయమే అయినా తన అభిమాన హీరో పెళ్లి చేసుకోడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ కిచ్లూతో అక్టోబర్ 30న అంటే మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. దీనితో ఉన్న రెండురోజుల టైం ను తన పార్టనర్ తో స్పెండ్ చేస్తుంది కాజల్. ఇక్కడ పార్ట్‌నర్ అంటే గౌతమ్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఆ పార్ట్‌నర్ చెల్లెలు నిషా అగర్వాల్.
మెగా స్టార్ చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ ?
మలయాళ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ "గీతాంజలి "మలయాళ మూవీ తో హీరోయిన్ గా మారారు. "ఇదు ఎన్న మాయం "మూవీ తో కోలీవుడ్ , "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు కీర్తి పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. "మహానటి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.
వెబ్ సిరీస్ లో సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఫిదా " మూవీలో తెలంగాణ అమ్మాయి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాట పర్వం " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు.
నాగశౌర్య - అనీష్ కృష్ణ సినిమా లాంచ్
యంగ్ హీరో నాగశౌర్య వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరో సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు. ఇటీవలే డైరెక్టర్ అనీష్ కృష్ణతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ రోజు ప్రారంభించారు. ముందుగా స్క్రిప్ట్ ను నిర్మాత నాగవంశీ చిత్రయూనిట్ సభ్యులకు అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా..కొరటాల శివ క్లాప్ కొట్టాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించాడు.
రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ
గతకొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే పిల్లలు శివాని.. శివాత్మిక భార్య జీవిత రికవరీ అవ్వగా రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూనే వున్నారు. సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో రాజశేఖర్ మాత్రం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో శివాని.. శివాత్మిక.. వైద్య సిబ్బంది రాజశేఖర్ హెల్త్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే వున్నారు.
'వైల్డ్ డాగ్' - నాగ్ కోసం స్టంట్స్ కంపోజ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి
ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో ఉన్నసంగతి తెలిసిందే. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం హిమాలయాలకు వెళ్ళింది చిత్రయూనిట్. ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో మొదలైంది. దాదాపు మూడు వారలు అక్కడే నిర్విరామంగా షూటింగ్ చేసుకోనున్నారు. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
మనసుకు నచ్చితే చాలు - అనుష్క
"సూపర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "అరుంధతి ", "రుద్రమదేవి ", "భాగమతి "వంటి బ్లాక్ బస్టర్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ఒక స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
"పెళ్ళిసందD " మూవీలో మాళవిక నాయర్
ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా "పెళ్ళిసందD " మూవీ రూపొందనుంది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ "పెళ్ళిసందడి "(1996 ) మూవీకి రీమేక్ గా ఈ మూవీ రూపొందనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
షూటింగ్ కు రెడీ అవుతున్న 'వకీల్ సాబ్'
ఫైనల్లీ వకీల్ సాబ్ షూట్ కి సిద్దమవుతున్నాడు. ఇన్నిరోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది చిత్రయూనిట్. ముందు పవన్ లేని షాట్స్ ను కంప్లీట్ చేశారు. పవన్ కు సంబంధించి ఇంకాస్త బ్యాలన్స్ షూట్ మిగిలివుంది.
ఛార్మీ పేరెంట్స్ కు కరోనా పాజిటివ్
ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతూనే ఉన్నట్టు కనిపిస్తున్నా సినీ సెలబ్రిటీస్ ను.. వారి కుటుంబాలను మాత్రం వదిలేలా కనిపించట్లేదు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. కొంతమంది కోలుకున్నా కొంతమంది మాత్రం మృతి చెందారు. ఇక ఇటీవలే తమన్నా పేరెంట్స్ కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటి పేరెంట్స్ కూడా కరోనా బారిన పడ్డారు. వారు ఎవరో కాదు ఛార్మీ కౌర్ పేరెంట్స్.
బిగ్ బాస్ 4- అభి, మోనాల్ కు రాయబారిగా అఖిల్
బిగ్ బాస్ 4 - అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నారు హౌస్ మేట్స్. ఇక నిన్న 51వ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ నామినేషన్స్ తర్వాత హౌస్ మేట్స్ ఇంకా దాని గురించే చర్చించుకుంటున్నారు. అభిజిత్‌తో మోనాల్ మధ్య ఉన్న గ్యాప్ ను క్లియర్ చేసుకోమని అఖిల్ మోనాల్ కు చెపుతాడు. దానికి నేను ఇంకా అలిసిపోయా అని చెప్పడంతో పోనీ నేను మాట్లాడనా అని అనుమతి తీసుకుని అభిజిత్ దగ్గరకు వెళ్లాడు. ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుందని అఖిల్ సూచించడంతో అందుకు ఓకే చెప్పిన అభి రేపు మాట్లాడదామన్నాడు. మరోపక్క అమ్మ రాజశేఖర్, సోహెల్, మెహబూబ్ అదే నామినేషన్స్ గురించి చర్చ. తనను సోహెల్ నామినేట్ చేయడంతో అమ్మ రాజశేఖర్…
కామెడీ ఎంటర్ టైనర్ "F 2: ఫన్ &ఫ్రస్టేషన్"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "F 2: ఫన్ &ఫ్రస్టేషన్" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ కథానాయికలు. రాజేంద్ర ప్రసాద్ , ప్రకాష్ రాజ్ , వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. ప్రముఖ యాంకర్ అనసూయ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మొదలైన శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’
నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈసినిమా షూటింగ్ తిరుపతిలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా హీరో, హీరోయిన్‌పై ముహూర్తం షాట్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ.. ‘వినూత్నమైన…
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్
"తొలి ప్రేమ ", "బద్రి " , "ఖుషి ", "జల్సా ", గబ్బర్ సింగ్ ", "అత్తారింటికి దారేది " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించారు.పొలిటికల్ పార్టీ "జనసేన "ప్రారంభించడం తో సినిమాలకు పవన్ దూరం అయ్యారు. దాదాపు 3సంవత్సరాల తరువాత "వకీల్ సాబ్" మూవీతో రీ ఎంట్రీ ఇవ్వడం తో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ " మూవీ తో పాటు పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయ దశమి సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా మరో మూవీ అనౌన్స్ అయ్యింది.
రీతూ వర్మ ట్రెడిషినల్ లుక్
సక్సెస్ ఫుల్ రొమాంటిక్ కామెడీ "ప్రేమ ఇష్క్ కాదల్" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తెలుగు అమ్మాయి రీతూవర్మ "నా రాకుమారుడు", "ఎవడే సుబ్రమణ్యం " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "పెళ్ళిచూపులు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూవర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సూపర్ హిట్ "వేల ఇల్ల పట్టాధారి 2 "తమిళ మూవీ లో అతిధి పాత్రలో నటించిన రీతూవర్మ తరువాత కోలీవుడ్ లో బిజీగా మారారు.
"ఈశ్వరుడు "మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ కె వి దురై బ్యానర్ లో నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు కథానాయకుడిగా "ఈశ్వరన్"తమిళ మూవీ రూపొందుతుంది. తమిళ వెర్షన్ "ఈశ్వరన్", తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ఈశ్వరుడు " మూవీ సంక్రాంతి పండగకు రిలీజ్ కానున్నాయి. "ఈశ్వరన్"తమిళ మూవీ లో నిధి అగర్వాల్ కథానాయిక. "భూమి "తమిళ మూవీ లో నటిస్తున్న నిధి కి 2 వ తమిళ మూవీగా "ఈశ్వరన్" తెరకెక్కింది.
'సుల్తాన్' సినిమాపై రష్మిక ఎమోషన్ - నమ్మలేనట్టుగా ఉంది
రెమో ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా 'సుల్తాన్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కార్తి చాలా స్టైలిష్‌గా, యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చేతిలో కొరడా కూడా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది.
"పెళ్ళి సందD" మూవీ హీరో రోషన్
శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా , రవళి , దీప్తి భట్నాగర్ కథానాయికలుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పెళ్ళి సందడి "(1996 ) మూవీ ఘనవిజయం సాధించింది. కీరవాణి స్వరకల్పనలోని సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని "పెళ్ళి సందడి " మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 25 సంవత్సరాల తరువాత "పెళ్ళి సందడి " మూవీ "పెళ్ళి సందD" గా రీమేక్ కానుంది.
లాంఛనంగా ప్రారంభమైన ‘థ్యాంక్యూ’
మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ‘థ్యాంక్యూ’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. నాగ్ పుట్టిన రోజు నాడు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల సెట్స్ పైకి వెళ్ళలేదు ఈ సినిమా. అయితే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి ఫైనాన్సియర్ సత్య రంగయ్య క్లాప్‌నిచ్చారు. ‘త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంచించనున్నారు.
ఆకట్టుకుంటున్న 'ఆకాశమే నీ హద్దురా' ట్రైలర్
కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా.. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ‘సూరరై పోట్రు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. అయితే అక్టోబర్ 30న విడుదల చేయాలని ఫిక్స్ చేసారు కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 12న రిలీజ్ చేయనున్నారు.