నాగశౌర్య – అనీష్ కృష్ణ సినిమా లాంచ్

NagaShaurya Launches His Next Movie Under His Home Banner

యంగ్ హీరో నాగశౌర్య వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరో సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు. ఇటీవ‌లే డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ రోజు ప్రారంభించారు. ముందుగా స్క్రిప్ట్ ను నిర్మాత నాగ‌వంశీ చిత్ర‌యూనిట్ సభ్యుల‌కు అంద‌జేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయ‌గా..కొర‌టాల శివ క్లాప్ కొట్టాడు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్‌పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. డిసెంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. హీరోయిన్, ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

ఇక ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనితో పాటుసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =