మొత్తానికి ఇంకో రెండు రోజుల్లో మిస్ టాగ్ నుండి మిస్ట్రెస్ టాగ్ కు మారిపోనుంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అభిమానులకు ఇది కొంచం బాధ కలిగించే విషయమే అయినా తన అభిమాన హీరో పెళ్లి చేసుకోడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ కిచ్లూతో అక్టోబర్ 30న అంటే మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. దీనితో ఉన్న రెండురోజుల టైం ను తన పార్టనర్ తో స్పెండ్ చేస్తుంది కాజల్. ఇక్కడ పార్ట్‌నర్ అంటే గౌతమ్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఆ పార్ట్‌నర్ చెల్లెలు నిషా అగర్వాల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కాజల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. మిస్ అగర్వాల్ కు ఇంకా రెండు రోజులే. ప్రతీ విషయాన్ని నా పార్ట్‌నర్ నిషా తో కలిసి కలిసి ఎంజాయ్ చేస్తున్నానని.. నిషాతో సోఫాలో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మరి నిషా, కాజల్ ఎంత క్లోజ్ గా వుంటారో అందరికీ తెలిసిన విషయమే.
ఇక ఇదిలా ఉండగా కాజల్ హల్దీ, మెహెందీ సెర్మనీ వేడుకలు నేడు జరుగనున్నాయి. రేపు అక్టోబర్ 29న సంగీత్ కార్యక్రమం జరుగనుంది. ఇక కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పెళ్ళికి మాత్రం చాలా తక్కువ మందికే ఆహ్వానం అందింది. పెద్ద హడావుడి లేకుండా సింపుల్ గానే కానిచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఇరు కుటుంబసభ్యులతో పాటు చాలా కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: