మెగా స్టార్ చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ ?

Actress Keerthy Suresh Bags Opportunity To Act In A Tamil Remake Movie Opposite Mega Star Chiranjeevi

మలయాళ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ “గీతాంజలి “మలయాళ మూవీ తో హీరోయిన్ గా మారారు. “ఇదు ఎన్న మాయం “మూవీ తో కోలీవుడ్ , “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు కీర్తి పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కీర్తి కథానాయికగా నటించిన “మిస్ ఇండియా “, “గుడ్ లక్ సఖి “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “రంగ్ దే “మూవీ లో నటిస్తున్న కీర్తి మహేష్ బాబు “సర్కారు వారి పాట ” మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. “మరక్కార్ “(మలయాళ ), “అన్నాత్తే “(తమిళ )మూవీస్ లో నటిస్తున్న కీర్తి , చిరంజీవి హీరోగా రూపొందనున్న మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం. స్టైలిష్ మూవీస్ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తమిళ సూపర్ హిట్ “వేదాళం “మూవీ తెలుగు లో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో సోదరి క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యత ఉంది. సోదరి క్యారెక్టర్ కు ముందుగా సాయి పల్లవి ఎంపిక అయ్యారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కు కీర్తి ఫైనల్ అయినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =