షూటింగ్ కు రెడీ అవుతున్న ‘వకీల్ సాబ్’

Power Star Pawan Kalyan To Join Vakeel Saab Movie Shoot After Lockdown

ఫైనల్లీ వకీల్ సాబ్ షూట్ కి సిద్దమవుతున్నాడు. ఇన్నిరోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది చిత్రయూనిట్. ముందు పవన్ లేని షాట్స్ ను కంప్లీట్ చేశారు. పవన్ కు సంబంధించి ఇంకాస్త బ్యాలన్స్ షూట్ మిగిలివుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు పవన్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ నవంబర్ 1 నుంచి షూట్ లో పాల్గొనేందుకు ఈ వకీల్ సాబ్ టైం ను ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పవన్ పై మిగిలి ఉన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీనితో షూటింగ్ పూర్తి కానుంది.

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =