మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ‘థ్యాంక్యూ’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. నాగ్ పుట్టిన రోజు నాడు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల సెట్స్ పైకి వెళ్ళలేదు ఈ సినిమా. అయితే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి ఫైనాన్సియర్ సత్య రంగయ్య క్లాప్‌నిచ్చారు. ‘త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంచించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్, హర్షిత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. రష్మికను హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీగా పీసీ శ్రీరామ్ పని చేయనున్నాడు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవలే షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేసారు. షూటింగ్ కూడా ముగింపు దశకు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: