శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా , రవళి , దీప్తి భట్నాగర్ కథానాయికలుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పెళ్ళి సందడి “(1996 ) మూవీ ఘనవిజయం సాధించింది. కీరవాణి స్వరకల్పనలోని సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని “పెళ్ళి సందడి ” మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 25 సంవత్సరాల తరువాత “పెళ్ళి సందడి ” మూవీ “పెళ్ళి సందD” గా రీమేక్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్ర రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో “పెళ్ళి సందD” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా ఎంపిక అయ్యారు. “పెళ్ళి సందడి ” మూవీలో తన తండ్రి (శ్రీకాంత్ ) నటించిన పాత్రలో 25 సంవత్సరాల తరువాత తనయుడు (రోషన్ ) నటించడం విశేషం.
“నిర్మల కాన్వెంట్ “మూవీ తో రోషన్ టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.”పెళ్ళి సందD” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: