“పెళ్ళిసందD ” మూవీలో మాళవిక నాయర్

Yevade Subramanyam Movie Fame Malvika Nair To Pair Up With Roshan In Pelli Sandadi Movie Sequel

ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా “పెళ్ళిసందD ” మూవీ రూపొందనుంది. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ “పెళ్ళిసందడి “(1996 ) మూవీకి రీమేక్ గా ఈ మూవీ రూపొందనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ “ఎవడే సుబ్రమణ్యం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ నటి మాళవిక నాయర్ “కల్యాణ వైభోగమే “, “మహానటి “, “టాక్సీవాలా “, ఒరేయ్ బుజ్జిగా ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “పెళ్ళిసందD ” మూవీలో మాళవిక నాయర్ కథానాయికగా ఎంపిక అయ్యారు. ఒక కొత్త కథానాయికను ఎంపిక చేయాలనుకున్న మేకర్స్ ఫైనల్ గా మాళవిక ను కథానాయికగా ఎంపిక చేశారు. హీరో రోషన్ “నిర్మలా కాన్వెంట్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − one =