రెమో ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా ‘సుల్తాన్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కార్తి చాలా స్టైలిష్‌గా, యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చేతిలో కొరడా కూడా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైన్‌ర్‌గా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో రష్మిక తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఎమోషన్ అవుతూ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. `చిన్నప్పటి నుంచి నాన్న, నేను ఎక్కువగా తమిళ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు ఇంత పెద్ద తమిళ సినిమాలో నేను నటించడం నమ్మలేనట్టుగా ఉంది. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. నేను నిజంగా కృతజ్ఞురాలిన`ని రష్మిక ట్వీట్ లో పేర్కొంది.
A few words about #Sulthan is that it’s my first Tamil film and since I was a little girl dad and I have watched so many Tamil films and it feels surreal that now I get to work with such big and yet humble and wonderful people.. I am truly greatful for all that I have right now🤍
— Rashmika Mandanna (@iamRashmika) October 26, 2020
డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం వివేక్ మెర్విన్ అందిస్తుండగా.. ఎడిటింగ్: అంతొనీ, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ గా పనిచేస్తున్నారు.
మరి గతేడాది ‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఎంత వరకూ విజయం దక్కించుకుంటుందో చూద్దాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























