బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఫిదా ” మూవీలో తెలంగాణ అమ్మాయి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం “లవ్ స్టోరీ “, “విరాట పర్వం ” మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథా బలం ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని నటిస్తున్న సాయి పల్లవి, హీరో నాని కథానాయకుడిగా రూపొందనున్న “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి కూడా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ ఫేమ్ వెట్రి మారన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో పరువు హత్య నేపథ్యం లో రూపొందనున్న వెబ్ సిరీస్ లో సాయి పల్లవి , ప్రకాష్ రాజ్ కూతురి పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ OTT నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: