కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 122

సినిమా వార్తలు

కాజల్ కు "మోసగాళ్ళు "టీమ్ స్పెషల్ విషెస్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు " మూవీ రూపొందుతుంది. సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర , రూహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Bigg Boss 4 Team Gives A Glimpse Of 55 Days Of Their Journey To The House Mates
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - 55 రోజుల జర్నీ

బిగ్ బాస్ సీజన్ 4- చూస్తుండగానే 55 రోజులు పూర్తయింది. ప్రస్తుతానికి హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 15 మంది స‌భ్యుల‌తో ప్రారంభ‌మైన ఈ రియాలిటీ షోకు ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తం 18 మంది స‌భ్యుల‌తో బిగ్ బాస్ సీజన్ 4 కొనసాగుతుంది. ఇక ఈ 55 రోజుల్లో ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. మరోవైపు నిన్న ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు 55రోజుల జర్నీ చూపించి కాస్త ఎమోషనల్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన కాజల్ అగర్వాల్ పెళ్లి

మొత్తానికి టాలీవుడ్ లో ఒక్కొక్కరూ ఒక్కో ఇంటివారవుతున్నారు. 2020 సినిమాలకు కలిసిరాకపోయినా హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకుల పెళ్లిళ్లకు మాత్రం కలిసొచ్చింది. ఏ ఏడాది జరగనట్టుగా ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ వివాహాలు అవ్వగా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు ఏలిన కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4-జంట‌లుగా విడిపోయిన హౌజ్‌మేట్స్

బిగ్ బాస్ 4- 54వ రోజు.. నోయల్ బయటికి వెళ్లిపోవడంతో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చారని.. కాన్ఫెషన్ రూమ్ లో ఉన్నారని.. అరియానా కెప్టెన్ కావడంతో వెళ్లి తీసుకురావాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీనితో అందరూ షాకయ్యారు.. వచ్చేది ఎవరబ్బా అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అరియానా రెండు రోజులు క్రితం చేసిన రిక్వెస్ట్ కు ఇప్పుడు ఆ డాల్ ను పంపించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈ వారం ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్ మిస్ అవ్వకండి

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యాక్షన్ సీన్స్ లో నాగార్జున

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరో గా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ "వైల్డ్ డాగ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దియా మీర్జా , సయామీ ఖేర్ కథానాయికలు. హీరో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో అతుల్ కులకర్ణి , అలీ రెజా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు "వైల్డ్ డాగ్" మూవీ 70శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది.

Team TFNవాట్సాప్
Gatham Movie Trailer Release Is Out
ట్రైలర్ & టీజర్

సైకలాజికల్ థ్రిల్లర్‌ 'గతం' ట్రైలర్ రిలీజ్

కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గతం'. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాను మొత్తం అమెరికాలోనే మూడు నెలలపాటు షూటింగ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిన్ననే ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చాలా గ్రిప్పింగ్ గా.. మిస్టరీ గా ఉందని ప్రశంసిస్తూ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించాడు సత్యదేవ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నభా నటేష్ ట్రెడిషినల్ లుక్

సక్సెస్ ఫుల్ "వజ్రకాయ "(2015 ) కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన మోడల్ , భరతనాట్య డ్యాన్సర్ నభా నటేష్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. "నన్ను దోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ , బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్న నభా కథానాయికగా నటించిన "సోలో బ్రతుకే సో బెటర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'పవన్' రీమేక్ లో 'ఫిదా' బ్యూటీ - 'కన్నమ్మ' పాత్రలో..?

ఇన్ని రోజులుగా మలయాళంలో సూపర్‌ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌' రీమేక్ పై ఎన్నో వార్తలు వచ్చిన సంగతి చూసాం. అయితే విజయదశమి రోజు అధికారికంగా ప్రకటించారు. సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. మాలయాళంలో బిజు మీనన్‌ నటించిన పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. దీనికి ‘బిల్లా రంగా’ టైటిల్ ప్రచారంలో ఉంది.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - కెప్టెన్ గా అరియనా హౌస్ నుండి బయటికి వెళ్లిన నోయెల్

బిగ్ బాస్ 4 - నిన్న ఎపిసోడ్ స్టార్టింగే నోయల్ అనారోగ్యంతో బాధపడటం చూపించారు. అర్ధ‌రాత్రి దాటినా అనారోగ్యం కారణంగా నిద్ర పట్టకపోవడంతో కాస్త కన్నీరు పెట్టుకున్నాడు. ఇక పొద్దున్నే లేచిన తర్వాత అభి, నోయ‌ల్, హారిక ఒక దగ్గర కూర్చొని వుంటారు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న మోనాల్ ను చూసి మోనాల్ ఒంటెలా న‌డుస్తుంద‌ని అడగగా.. మ‌రి నువ్వు దుబాయ్ షేక్‌లా కూర్చున్నావ‌ని నోయ‌ల్ అభికి కౌంటర్ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
Poll Game: Which Among These Is Your Favorite Movie Of Ram?
సినిమా వార్తలు

పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?

వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ , ఇలియానా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ "దేవదాసు "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హీరో రామ్ , హీరోయిన్ ఇలియానా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చక్రి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

Team TFNవాట్సాప్
Boyapati Srinu and Nandamuri Balakrishna New Movie Team Kickstart Shooting Work After Lockdown
షూటింగ్ అప్‌డేట్

"BB3"మూవీ షూటింగ్ పునః ప్రారంభం

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ " BB3"మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అఘోరా గా ఒక పాత్ర , మరో పవర్ ఫుల్ పాత్రలో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ "సింహా ", "లెజెండ్ " మూవీస్ తరువాత బోయపాటి , బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది. షూటింగ్ ఒక షెడ్యూల్ తరువాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"నాంది "మూవీ షూటింగ్ పూర్తి

ఎస్ వి 2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రైటర్ , డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా నూతన దర్శకుడు విజయ్ కనక మేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ "నాంది -ఎ న్యూ బిగినింగ్ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ , నవమి , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాస్ లుక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

సక్సెస్ ఫుల్ "అల్లుడు శీను " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ మూవీ లో డ్యాన్స్ , ఫైట్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ ఎంటర్ టైనర్స్ "జయ జానకి నాయక ", "సాక్ష్యం " వంటి మూవీస్ తో సాయి ప్రేక్షకులను అలరించారు. సాయి హీరో గా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ "రాక్షసుడు "మూవీ ఘనవిజయం సాధించింది. సాయి ప్రస్తుతం ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు జోడీగా సాయి పల్లవి ?

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ K చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. సూపర్ హిట్ మలయాళ మూవీ "అయ్యప్పనుమ్ కోషియమ్ " కు తెలుగు రీమేక్ గా రూపొందనుంది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. "గబ్బర్ సింగ్ ", సర్దార్ గబ్బర్ సింగ్" వంటి మూవీస్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"RRR" మూవీ షూటింగ్ లో అలియాభట్ ఎంట్రీ

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో లుగా మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

చిరంజీవి రెడీ ఫర్ షూటింగ్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా ప్రముఖ యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

'మిస్ ఇండియా' -'లచ్చ గుమ్మాడి' లిరికల్‌ సాంగ్‌ రిలీజ్

న‌రేంద్ర దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'మిస్ ఇండియా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా స్టార్ట్ చేశారు. ఇప్పటీకే టీజర్.. ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ మీసం లుక్ పై నమ్రత రియాక్షన్

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. హాలీవుడ్ హీరో లకు పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉండగా మహేష్ ను మీసంతో చూసిన సందర్భాలు చాలా తక్కువే. మ్యాగ్జిమమ్ క్లీన్ షేవ్ లోనే ఉంటాడు. అయితే ఇప్పుడిప్పుడే కొత్త లుక్‌లలో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడూ యంగ్ లుక్‌లోనే కనిపించే మహేష్ తాజాగా ఓ కమర్షియల్ యాడ్‌లో మీసకట్టుతో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా స్పందించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో ఛాలెంజింగ్ రోల్ లో నాని

హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న "టక్ జగదీష్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత సూప్ హిట్ "బ్రోచేవారెవరురా "మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మూవీని హీరో నాని ఓకే చేశారు. వరస చిత్రాలతో హీరో నాని బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్

షేర్