పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్

Power Star Pawan Kalyan To Play Police Officer Once Again After Gabbar Singh

“తొలి ప్రేమ “, “బద్రి ” , “ఖుషి “, “జల్సా “, గబ్బర్ సింగ్ “, “అత్తారింటికి దారేది ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించారు.పొలిటికల్ పార్టీ “జనసేన “ప్రారంభించడం తో సినిమాలకు పవన్ దూరం అయ్యారు. దాదాపు 3సంవత్సరాల తరువాత “వకీల్ సాబ్” మూవీతో రీ ఎంట్రీ ఇవ్వడం తో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్ ” మూవీ తో పాటు పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయ దశమి సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా మరో మూవీ అనౌన్స్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “అప్పట్లో ఒకడుండేవాడు “మూవీ ఫేమ్ సాగర్ K చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్” మూవీ తెలుగు రీమేక్ గా ఈ మూవీ రూపొందనుంది. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ .. హీరో పవన్ కళ్యాణ్ తో మా సంస్థకు తొలి చిత్రమనీ , పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ పాత్ర శక్తివంతంగా సాగుతుందనీ , అభిమానులను అలరించే అన్ని అంశాలతో తెరకెక్కనుందనీ , నటీనటులు , టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామనీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 4 =