అమితాబ్‌ బచ్చన్‌ కామెంట్స్‌తో.. మరోసారి ట్రెండింగ్‌లోకి ‘పుష్ప’

Amitabh Bachchan Praises Allu Arjun Dance Moves in Srivalli Song From Pushpa Movie

బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ 15వ సీజన్‌ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన ప్రశ్నను అడిగారు బిగ్‌బీ. కాగా కార్యక్రమంలో భాగంగా ఓ కంటెస్టెంట్‌కు ఆయన ‘ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడు ఎవరు?’ అనే ప్రశ్నను సంధించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ ‘పుష్ప’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప’ చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాటను ప్రస్తావిస్తూ బన్నీని అభినందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమితాబ్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘పుష్ప’ అద్భుతమైన సినిమా. అల్లు అర్జున్‌ తన అభినయంతో ఆ పాత్రకు జీవం పోశాడు. ఇందులోని ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రజలకు బాగా చేరువైంది. ఆ పాటలో ఒకచోట అల్లు అర్జున్‌ అలా క్యాజువల్‌గా చెప్పు వదిలేసి, మళ్ళీ తొడుక్కుంటారు. సోషల్‌ మీడియాలో చాలా మంది ఆ స్టెప్పును ఫాలో అయ్యారు. ఆయనను చూసి అందరూ కూడా అదే స్టెప్‌ వేశారు. తమ చెప్పులు వదిలేసి, మళ్లీ వేసుకున్నారు. అయితే ఆ స్టెప్పు అంతలా వైరల్‌ అవ్వడం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఇలాంటిది నా జీవితంలో తొలిసారి చూశాను’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా ‘పుష్ప’ సినిమాలోని నటనకు గానూ అల్లు అర్జున్ ‘నేషనల్ బెస్ట్ యాక్టర్’ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. సీనియర్ నటుడు జగపతి బాబు, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, డాలీ ధనంజయ్, రావు రమేష్ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకక్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచగా.. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే దీనికిగానూ దేవి శ్రీ ప్రసాద్ కూడా నేషనల్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు కైవసం చేసుకున్నారు.

ఇక ఇదిలా ఉండగా.. ‘పుష్ప’ సెకండ్ పార్ట్‌ కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పోస్టర్స్ మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ రికార్డులు క్రియేట్ చేసింది. చిత్తూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంగమ్మ జాతరలో అమ్మవారిని పోలిన లుక్ లో వున్న బన్నీ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక మొదటి పార్ట్‌తో ఎన్నో సంచలనాలు సృష్టించిన పుష్ప రాజ్.. సెకండ్ పార్ట్‌తో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =