మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఈఏడాది పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రానుంది. దీంతో ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా టీజర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచి దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. వస్తున్నాం గెట్ రెడీ అంటూ మేకర్స్ తమ నిర్మాణ సంస్థ ద్వారా తెలియచేశారు. మరి ఏ అప్ డేట్ ఇస్తారు అన్నది చూడాలి.
Vasthunnam Get Ready 🤩#Eagle 🦅https://t.co/PdDcF16Ltt@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla @manibkaranam @sujithkolli https://t.co/8lhHdcOXYl pic.twitter.com/YhEm3g0lqb
— People Media Factory (@peoplemediafcy) November 9, 2023
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో నవదీప్,మధుబాల కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: