సలార్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ

makers clarity on salaar movie release date

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. రెండు భాగాలుగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో ఫస్ట్ పార్ట్ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. సలార్-సీజ్ ఫైర్ అంటూ వచ్చే ఈ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ ఇంకా పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. దానికి తోడు మరో కొత్త కథనం తెరపైకి వచ్చింది. ఒక భారీ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ విషయంలో సమస్యలు వచ్చాయని… అందుకే రిలీజ్ డేట్ లో మార్పు తప్పదన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఈసినిమా సలార్ సినిమానే అయి ఉంటుందన్న వార్తలు మొదలయ్యాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన సలార్ మేకర్స్ ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ తమ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 22వ తేదీనే ఈసినిమా రిలీజ్ కానుందని ట్వీట్ చేస్తూ స్పష్టం చేశాడు.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. కేరళలో పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.