మచ్ అవైటెడ్ సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది.ఈ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్.డిసెంబర్ 1న ఈట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.మరోవైపు ఈసినిమా రిలీజ్ వాయిదాపడుతుందని నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి.ఇక ఈవిషయంలో కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.రీసెంట్ గా ప్రకటించిన డేట్ ప్రకారం డిసెంబర్ 22నే విడుదలకానుందని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు చెప్పేశారట.దాంతో 22న విడుదల పక్కాఅయ్యినట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రెండు రోజుల క్రితం ప్రభాస్ కూడా తిరిగి ఇండియా కు వచ్చేయడం తో ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు.ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటరైనర్ గా వస్తున్న ఈసినిమాలో ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు.రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఇదిలావుంటే ఈసినిమాకు బాలీవుడ్ లో పోటీ ఎదురుకానుంది.సలార్ తోపాటు క్రిస్మస్ కు షారుక్ ఖాన్, డంకి కూడా విడుదలకానుంది.వరుసగా రెండు సార్లు 1000కోట్ల క్లబ్ లో చేరి షారుక్ ఫుల్ ఫామ్ లో ఉండటం అలాగే ప్లాప్ అంటే తెలియని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరక్ట్ చేస్తుండడం తో డంకి ఫై భారీ అంచనాలు వున్నాయి.దాంతో హిందీలో సలార్ కు భారీ పోటీనే ఎదురుకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: