సప్త సాగరాలు దాటి సైడ్ బి.. ఈసినిమా ప్రేక్షకులను మరింత మెప్పిస్తుంది

sapta sagaralu dhaati side b movie team shares interesting facts

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా కన్నడలో వచ్చిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ బాగా హిట్ అవ్వడంతో సప్త సాగరాలు దాటి సైడ్ బి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈనెల 17వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ, “నా సినిమాల నేను ఇక్కడికి రావడం ఇది నాలుగోసారి. గతంలో ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’, ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ చిత్రాల కోసం వచ్చాను. ఇప్పుడు సైడ్ బి కోసం వచ్చాను. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీడియా కూడా ఎంతో సపోర్ట్ గా ఉంది. తెలుగులో ఇంత ఘనంగా విడుదల చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, వివేక్ గారికి కృతఙ్ఞతలు” అన్నారు.

రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ, “సప్త సాగరాలు దాటి సైడ్ ఎ చిత్రాన్ని ఆదరించి, మాకు ఇంత ప్రేమ పంచిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మను, ప్రియల కథ మీ హృదయాల్లో చోటు సంపాదించుకోవడం సంతోషంగా ఉంది. సైడ్ బి లో మరిన్ని అందమైన పాత్రలు ఉంటాయి. సైడ్ బి కూడా మిమ్మల్ని మెప్పిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, వివేక్ గారికి థాంక్స్” అన్నారు.

చైత్ర జె. ఆచార్ మాట్లాడుతూ, “సైడ్ ఎ కి మీరిచ్చిన సపోర్ట్ కి చాలా హ్యాపీ. సైడ్ బి కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా సినిమాకి ఇక్కడ ఇంత ప్రేమ దొరకడానికి కారణమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధన్యవాదాలు” అన్నారు.

దర్శకుడు హేమంత్ రావు మాట్లాడుతూ, “తెలుగు రాష్ట్రాల్లో సైడ్ ఎ కి వచ్చిన స్పందన పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. సైడ్ ఎ కి కొనసాగింపుగా సైడ్ బి కథ ఉంటుంది. అయితే సైడ్ ఎ తో పోలిస్తే, సైడ్ బి షేడ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఎన్నో ఫోన్లు, మెసేజ్ లు చేసి ప్రశంసిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధన్యవాదాలు. హైదరాబాద్ లో సైడ్ ఎ కన్నడ వెర్షన్ మంచి స్పందన రావడం చూసి, తెలుగులో విడుదల చేయాలి అనుకున్నాం. తక్కువ సమయమే ఉన్నప్పటికీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఘనంగా విడుదల చేసి, మా చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేశారు”.

కాగా ఈ సినిమాలో రక్షిత్‌ శెట్టి కి జోడీదా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఈసినిమాకు సంగీతం చరణ్ రాజ్ అందించారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.