మంగళవారంకు అల్లు అర్జున్ సాయం 

allu arjun attending the pre release event of managalavaaram

ఆర్ ఎక్స్ 100తో సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి  డైరెక్టర్ అజయ్ భూపతి నుండి వస్తున్న మూడో సినిమా మంగళవారం.టైటిల్ ఆసక్తిని క్రీయేట్ చేయగా రీసెంట్ గా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు హైప్ ను తీసుకొచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ఈ హైప్ ను ఇంకా పెంచడానికి ఓ స్టార్ హీరోను వాడుకుంటుంది చిత్ర బృందం.అందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది.ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా రానున్నాడు.ఈ శనివారం ఈఈవెంట్ హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ లో సాయంత్రం 6గంటలకు జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ నటించగా నందితా శ్వేతా,అజ్మల్,అజయ్ ఘోష్ తదితరులు కీలక  పాత్రలు పోషించారు. కంటెంట్ క్లిక్ అయితే మాత్రం ఈ సినిమా సెన్సేషన్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈసినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా స్వాతి గుణాపాటి,సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు.మంగళవారం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.కట్స్ ఏమి చెప్పకుండా సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.ఈ నెల 17న ఈసినిమా తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =