ఆకట్టుకుంటున్న విక్రమ్ ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్

dhruva nakshathram movie telugu trailer out now

మొత్తానికి ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న విక్రమ్ ధ్రువనక్షత్రం సినిమా రిలీజ్ కాబోతుంది. తమిళ్ లో ధృవ నచ్చత్తిరం అంటూ రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ధ్రువ నక్షత్రం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమాలో.. జాన్ అనే స్పై క్యారెక్టర్‌ లో నటిస్తున్నాడు విక్రమ్. ఈ సినిమా 2017లోనే రిలీజ్ అవ్వాలి కానీ అప్పటినుండీ పెండింగ్ లోనే ఉంది. ఫైనల్లీ ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ అయితే బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో కూడా ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అన్నీ బాగున్నాయి.

ఇక ఈసినిమాలో రీతూ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 5 =