కెప్టెన్ మిల్లర్ నుండి సందీప్ ఇంటెన్స్ లుక్

sundeep kishans intense look from captain miller movie

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. 1930 – 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో గత కొద్దిరోజులుగా కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా ఫైనల్ గా డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు మేకర్స్. తాజాగా దానికి సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి పలు సినిమాలు పోటీ పడుతుండగా ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగిస్తున్నారు.

ఇక ఈసినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా తన ఇన్స్టా ద్వారా ఒక పోస్టర్ ను షేర్ చేశాడు. చెమటలతో తడిసిపోయిన షర్ట్ తో ఇంటెన్స్ లుక్ తో సందీప్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Sundeep Kishan (@sundeepkishan)

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =