కంగువ ఫైనల్ షెడ్యూల్ షురూ

suriya kanguva movie final schedule begins

శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను నేడు చెన్నైలో మొదలుపెట్టింది చిత్రయూనిట్. చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో సూర్యతో పాటు బాబి డియోల్ ఇంకా దిషా పటాని కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వచ్చే నెల నుండి మొదలుపెట్టనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + eight =