ఓవర్సీస్ లో లియో సంచలన కలెక్షన్స్

leo movie overseas collections creates new record

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ్ లో సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా తెలుగులో కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈవిషయాన్ని ఈసినిమాను తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీనే తెలియచేశారు. ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా సంచలన కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. యూఎస్, యూకే, కెనడా పలు దేశాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకూ ఓవర్సీస్ లో ఈసినిమా దాదాపు 25 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అంటే మన దేశ కరెన్సీతో పోల్చుకుంటే దాదాపు 200 కోట్ల అన్నమాట. మరి ఈరేంజ్ కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదు.

కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ పలు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =